Maruti S-Presso : దేశంలోనే అత్యంత చవకైన కారు ఇదే.. పైగా దానిపై రూ.1.30లక్షల తగ్గింపు.

Maruti S-Presso : దేశంలోనే అత్యంత చవకైన కారు ఇదే.. పైగా దానిపై రూ.1.30లక్షల తగ్గింపు.
X

Maruti S-Presso : దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 22, 2025 నుండి కొత్త జీఎస్టీ స్లాబ్ అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తమ అన్ని కార్ల ధరలను ఏకంగా రూ. 1.30 లక్షల వరకు తగ్గించి వినియోగదారులకు పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. ధరలు తగ్గిన తర్వాత, మారుతి సుజుకి మోడళ్లలో ఇప్పుడు ఆల్టో K10 కంటే కూడా చవకైన కారు ఒకటి తయారైంది. ఆ కారే మారుతి ఎస్-ప్రెస్సో.

జీఎస్టీ తగ్గింపు తర్వాత, మారుతి ఎస్-ప్రెస్సో మైక్రో ఎస్‌యూవీ కొత్త ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.49 లక్షలుగా ఉంది. ఇది ఇంతకు ముందు దేశంలోనే అత్యంత చవకైన కారుగా ఉన్న మారుతి ఆల్టో K10 కొత్త ధర (రూ. 3.69 లక్షలు) కంటే రూ. 20,000 తక్కువ. దీంతో, ప్రస్తుతం భారతదేశంలో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న కారుగా మారుతి ఎస్-ప్రెస్సో నిలిచింది.

మారుతి ఎస్-ప్రెస్సో మొత్తం 8 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 68PS పవర్, 90Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లలో లభిస్తుంది. అయితే, CNG వెర్షన్ కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. మారుతి సుజుకి సంస్థ అందించిన మైలేజ్ వివరాల ప్రకారం.. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24.12 కి.మీ నుంచి 25.30 కి.మీల వరకు, CNG వేరియంట్ కిలోకు 32.73 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. మంచి మైలేజ్ కావాలనుకునే వారికి ఎస్-ప్రెస్సో బెస్ట్ ఆప్షన్.

తక్కువ బడ్జెట్‌లో లభిస్తున్నప్పటికీ, మారుతి ఎస్-ప్రెస్సోలో అనేక ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీ-లెస్ ఎంట్రీ, సెమీ-డిజిటల్ క్లస్టర్, సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ABS+EBD వంటి ఫీచర్లు లభిస్తాయి.

Tags

Next Story