Maruti Suzuki : హ్యాచ్ బ్యాక్ మోడల్ లో సీఎన్ జీ వేరియంట్

దేశంలో అత్యధిక ఆదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ మోడల్ కార్లలో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఒకటి. ఈ మోడల్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ను మారుతీ గురువారం లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.8.19 లక్షల (ఎక్స్- షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. అధిక ఇంధన సామర్థ్యంతో దీన్ని తీసుకొచ్చింది. కొత్త సీఎన్‌జీ రాకతో మారుతీ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 14సీఎన్‌జీ మోడల్స్ ఉన్నాయి. మారుతీ సుజుకీ కొత్త స్విఫ్ట్ సీఎన్‌జీ వేరియంట్‌లో 1.2 లీటర్ల జెడ్ సిరీస్ డ్యూయల్ వీవీటీ ఇంజెన్ అమర్చారు. ఈ ఇంజిన్ 69.75పీఎస్ శక్తిని, 101.8Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనాలు పాత సీఎన్‌జీల కంటే మెరుగైన మైలేజ్ అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. కిలో సీఎన్‌జీకి 32.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని మారుతీ తెలిపింది. ఆరు ఎయిర్‌బ్యాగ్ లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ప్లస్, హిల్ హోల్డ్ అసిస్టెంట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్, వైర్‌లెస్ ఛార్జర్, 60:40 స్పిల్ట్ రియర్ సీట్, 7 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం.. వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గతంలో సీఎన్‌జీలో వీఎక్స్‌ఐ, జెడ్ఎక్స్‌ఐ వేరియంట్లు మాత్రమే ఉండేవి. తాజాగా స్విఫ్ట్ సీఎన్‌జీ వేరియంట్‌లో వీఎక్స్‌ఐ (o) వేరియంట్‌ను జోడించారు. స్విఫ్ట్ వీఎక్స్‌ఐ సీఎన్‌జీ ధర రూ.8.19లక్షలు (ఎక్స్- షోరూమ్)కాగా, వీఎక్స్‌ఐ(o) వేరియంట్ ధర రూ.8.46లక్షలు (ఎక్స్- షోరూమ్)గా, జెడ్‌ఎక్స్‌ఐ సీఎన్‌జీ ధర రూ.9.19లక్షలు (ఎక్స్- షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com