Maruti Suzuki Victoris : హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ.. తొలి నెలలోనే 4 వేలకు పైగా విక్టోరిస్ కార్లు సేల్.

Maruti Suzuki Victoris : హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ.. తొలి నెలలోనే 4 వేలకు పైగా విక్టోరిస్ కార్లు సేల్.
X

Maruti Suzuki Victoris : దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యానికి గట్టి పోటీ ఇవ్వడానికి మారుతి సుజుకి నుంచి వచ్చిన కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ విక్టోరిస్ అద్భుతమైన ప్రారంభాన్ని అందుకుంది. ఐదు సీట్ల ఈ కొత్త ఎస్‌యూవీ... లాంచ్ అయిన తొలి నెలలోనే కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. ఆరెనా డీలర్‌షిప్‌ల ద్వారా కేవలం ఒకే నెలలో ఏకంగా 4,261 యూనిట్ల విక్టోరిస్ కార్లు అమ్ముడైనట్లు సేల్స్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. నవరాత్రి సమయంలో ఈ కార్ల డెలివరీలు ప్రారంభమయ్యాయి.

మారుతి సుజుకి విక్టోరిస్ తొలి నెల అమ్మకాల విషయంలో హోండా ఎలివేట్, టాటా హారియర్, టాటా సఫారీ వంటి ప్రముఖ ఎస్‌యూవీలను వెనక్కి నెట్టింది. అయితే, ఈ దూకుడును కొనసాగించగలదా అనేది చూడాలి. క్రెటాకు ప్రధాన పోటీదారుగా నిలిచినప్పటికీ, సెప్టెంబర్ 2025లో క్రెటా ఏకంగా 18,816 యూనిట్ల అమ్మకాలతో తన మార్కెట్‌ లీడర్‌షిప్‌ను కొనసాగించింది. విక్టోరిస్, రెగ్యులర్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండడం ఈ కారుకు అదనపు బలం.

మారుతి సుజుకి విక్టోరిస్ ఎస్‌యూవీ ధర భారతదేశంలో రూ.10.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది బేస్ వేరియంట్ ధర. ఇక టాప్ వేరియంట్ ధర సుమారు రూ.20 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ కారుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా దీని బుకింగ్‌లు ఇప్పటికే 25 వేల మార్కును దాటినట్లు Gaadiwaadi నివేదిక పేర్కొంది. కొన్ని వేరియంట్లకు డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందంటే వెయిటింగ్ పీరియడ్ 10 వారాల వరకు పెరిగింది.

విక్టోరిస్ కేవలం అమ్మకాలలోనే కాకుండా సేఫ్టీ విషయంలోనూ అద్భుతమైన మార్కులు సాధించింది. ఈ కారు గ్లోబల్ ఎన్‌క్యాప్, భారత ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. దీంతో సేఫ్టీ విషయంలో రాజీ పడకుండా మంచి మైలేజీ, ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది.

మారుతి విక్టోరిస్‌లో 1.5 లీటర్ K-సిరీస్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది 6000rpm వద్ద 103.06PS పవర్, 4300rpm వద్ద 139Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ మోడల్‌లో 1.5-లీటర్ త్రీ-పాట్ పెట్రోల్ ఇంజిన్ 5500rpm వద్ద 92.45PS పవర్, 122Nm టార్క్ జనరేట్ చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, స్టాండర్డ్ పెట్రోల్ ఇంజిన్ లీటర్‌కు 21 కిలోమీటర్ల వరకు మైలేజీనిస్తుండగా, హైబ్రిడ్ eCVT మోడల్ లీటర్‌కు 28.65 కిలోమీటర్ల వరకు అత్యద్భుత మైలేజీని అందిస్తుంది.

Tags

Next Story