Maruti Victoris : మారుతి విక్టోరిస్‌కు ఊహించని డిమాండ్.. 33,000 బుకింగ్స్‌లో 30% కేవలం సీఎన్‌జీవే.

Maruti Victoris : భారత మార్కెట్‌లో ఇటీవల విడుదలైన మారుతి విక్టోరిస్ ఎస్‌యూవీకి కస్టమర్ల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. బ్రెజా కంటే ప్రీమియంగా, గ్రాండ్ విటారా కంటే సరసమైన ధరలో విడుదలైన ఈ ఎస్‌యూవీకి ఇప్పటివరకు 33,000కు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. ఈ అద్భుతమైన స్పందనలో ముఖ్యంగా సీఎన్‌జీ వేరియంట్ కీలకంగా మారింది. ఎందుకంటే, విక్టోరిస్‌లో అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్ ఉండటం వల్ల బూట్ స్పేస్ సమస్య లేకుండా పోయింది. మొత్తం బుకింగ్స్‌లో 30% కంటే ఎక్కువ కేవలం సీఎన్‌జీ మోడల్‌కే రావడం విశేషం.
మారుతి సుజుకి నుంచి ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన విక్టోరిస్ ఎస్‌యూవీకి అనతికాలంలోనే అద్భుతమైన బుకింగ్స్ వచ్చాయి. ఈ ఎస్‌యూవీ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 33,000కు పైగా బుకింగ్‌లను నమోదు చేసింది. ఇది ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మారుతికి బలమైన పునాదిని సూచిస్తుంది. కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) పార్థో బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బుకింగ్స్‌లో 30% కంటే ఎక్కువ (సుమారు 11,000 బుకింగ్‌లు) కేవలం సీఎన్‌జీ వేరియంట్‌కే వచ్చాయి. అంటే బుక్ అయిన ప్రతి మూడు విక్టోరిస్ ఎస్‌యూవీలలో ఒకటి సీఎన్‌జీ మోడల్ కావడం విశేషం.
సాధారణంగా సీఎన్‌జీ వాహనాలలో బూట్ స్పేస్ తగ్గిపోతుంది. ఇది చాలా మంది వినియోగదారులకు ఒక సమస్యగా ఉంటుంది. అయితే, మారుతి విక్టోరిస్ ఈ సమస్యను తెలివిగా పరిష్కరించి కస్టమర్లను ఆకర్షించింది. మారుతి విక్టోరిస్ ఎస్‌యూవీలో సీఎన్‌జీ ట్యాంక్‌ను వాహనం అండర్‌బాడీ కింద అమర్చారు. దీనివల్ల బూట్ స్పేస్‌లో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేకుండా పోయింది. మెరుగైన మైలేజ్‌తో పాటు, పూర్తి బూట్ స్పేస్ ఉండటంతో వినియోగదారులు సీఎన్‌జీ మోడల్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ సీఎన్‌జీతో పాటు, ఎస్‌యూవీ ఈ-సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో లభించే స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌కు కూడా మంచి స్పందన లభించినట్లు బెనర్జీ తెలిపారు.
మారుతి సుజుకి విక్టోరిస్ అప్‌మార్కెట్ లుక్‌తో పాటు, అడ్వాన్సుడ్ టెక్నాలజీ ఫీచర్లతో వచ్చింది. దీని విక్రయాలు మారుతి సుజుకి అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా జరుగుతున్నాయి. మొత్తం బుకింగ్‌ల సంఖ్యలో, ADAS ఫీచర్లు ఉన్న వేరియంట్ల వాటా 16%గా ఉంది. ఈ ఎస్‌యూవీ మూడు వేర్వేరు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో వస్తుంది.. మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, సీఎన్‌జీ టెక్నాలజీతో కూడిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్.
విక్టోరిస్ ఎస్‌యూవీ ధరలు, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో వైవిధ్యం ఉంది. ఇది విస్తృత శ్రేణి కస్టమర్లను ఆకర్షిస్తోంది. మారుతి విక్టోరిస్ ప్రారంభ ధర రూ.10.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.19.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
ట్రాన్స్‌మిషన్ ఎంపికలు
మైల్డ్-హైబ్రిడ్: 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ ఆప్షన్
స్ట్రాంగ్ హైబ్రిడ్: ఈ-సీవీటీ (e-CVT) ట్రాన్స్‌మిషన్.
పెట్రోల్-సీఎన్‌జీ: 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

