Maruti : మారుతి నుంచి ఫ్యామిలీ ప్యాక్..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు..కియా కేరెన్స్‌కు ఇక చుక్కలే.

Maruti : మారుతి నుంచి ఫ్యామిలీ ప్యాక్..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు..కియా కేరెన్స్‌కు ఇక చుక్కలే.
X

Maruti : భారత కార్ల మార్కెట్ రారాజు మారుతి సుజుకి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే e Vitara పేరుతో తన మొదటి ఎలక్ట్రిక్ SUVని సిద్ధం చేసిన కంపెనీ, త్వరలోనే ఒక భారీ ఫ్యామిలీ కారును కూడా తీసుకురాబోతోంది. YMC అనే కోడ్ నేమ్‌తో పిలవబడుతున్న ఈ కారు మారుతి నుంచి రానున్న తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ MPV. ఇది మార్కెట్లో ఉన్న కియా కేరెన్స్ ఈవీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతి లైనప్‌లో ఇప్పటికే ఉన్న ఎర్టిగా, XL6 కంటే ఇది చాలా రిచ్‌గా, ప్రీమియం ఫీచర్లతో ఉండబోతోంది.

రేంజ్ మరియు టెక్నాలజీ అదుర్స్

ఈ కొత్త ఎలక్ట్రిక్ MPVని సెప్టెంబర్ 2026 నుంచి ఉత్పత్తి చేసేందుకు మారుతి ప్లాన్ చేస్తోంది. ఇది 27PL స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుంది.. అంటే కారు లోపల స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 49kWh, 61kWh అనే రెండు రకాల ఆప్షన్లు ఉండవచ్చు. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉన్న కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అంచనా. లాంగ్ జర్నీలు చేసే ఫ్యామిలీలకు ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్‌గా మారనుంది.

ఛార్జింగ్ టెన్షన్ అక్కర్లేదు

ఎలక్ట్రిక్ కార్లు కొనేవారికి ప్రధాన సమస్య ఛార్జింగ్. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి దేశవ్యాప్తంగా తన ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరిస్తోంది. ఇప్పటికే 1,100 నగరాల్లో 2,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. 2030 నాటికి ఏకంగా లక్ష ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే వినియోగదారుల కోసం e for me అనే మొబైల్ యాప్‌ను కూడా లాంచ్ చేసింది. దీని ద్వారా దగ్గరలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్లను సులభంగా కనుగొనవచ్చు.

Tags

Next Story