Maruti e Vitara : మారుతి నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు.. e-Vitara లాంచ్ తేదీ ఫిక్స్.

Maruti e Vitara : మారుతి నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు.. e-Vitara లాంచ్ తేదీ ఫిక్స్.
X

Maruti e Vitara : భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఎట్టకేలకు తమ అతిపెద్ద మార్పు అయిన ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తోంది. కంపెనీ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు ఈ విటారాను డిసెంబర్ 2, 2025 న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కార్ లాంచ్ దేశీయ ఈవీ మార్కెట్‌లో ఒక సంచలనం సృష్టించనుంది. మోడ్రన్ డిజైన్, రెండు బ్యాటరీ ఆప్షన్లు, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి వివరాలు, రేంజ్, అంచనా ధరను తెలుసుకుందాం.

మారుతి సుజుకి తమ తొలి ఎలక్ట్రిక్ కారు e-Vitara లాంచ్‌తో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఒక ముఖ్యమైన అడుగు వేస్తోంది. మారుతి ఈ విటారా భారతదేశంలో డిసెంబర్ 2, 2025 న లాంచ్ కానుంది. ఈ కారును కంపెనీ ప్రత్యేకంగా రూపొందించిన Heartect-e ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. e-Vitara రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. 49 kWh (సిటీలో ప్రయాణించే వారి కోసం), 61 kWh (ఎక్కువ రేంజ్ కోరుకునే వారి కోసం).

ఈ విటారా బ్యాటరీ సైజ్ బట్టి రెండు రకాల రేంజ్, పవర్ అవుట్‌పుట్‌లను అందిస్తుంది. 49 kWh బ్యాటరీ ప్యాక్ గల వేరియంట్ 344 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది, 142 bhp పవర్, 193 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 61 kWh వేరియంట్ విషయానికి వస్తే ఈ పెద్ద బ్యాటరీ ప్యాక్ రెండు రకాలుగా వస్తుంది. FWD వేరియంట్ 426 కిలోమీటర్ల రేంజ్, 171 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. AWD వేరియంట్ 395 కిలోమీటర్ల రేంజ్, 181 bhp పవర్, 307 Nm టార్క్ ఇస్తుంది. ఈ విటారా ప్రారంభ ధర సుమారు రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉండవచ్చని తెలుస్తోంది.

ఈ విటారా డిజైన్‌లో లోపలి భాగంలో అనేక మోడ్రన్, ప్రీమియం ఫీచర్లను పొందుపరిచారు. ఇది మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, Y-ఆకారపు LED DRLs ఉన్నాయి. ఎలక్ట్రిక్ కారు కాబట్టి, ఇందులో రేడియేటర్ గ్రిల్ లేదు. సైడ్స్‌లో బ్లాక్ క్లాడింగ్, 18-అంగుళాల ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. లోపలి భాగం ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఇందులో డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-స్క్రీన్ డాష్‌బోర్డ్ సెటప్ ఉంది, ఇందులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్, 10-వే అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా వ్యూ, ADAS వంటి అడ్వాన్సుడ్ టెక్నాలజీని అందించారు.

Tags

Next Story