Mercedes-Benz S-Class: ఇది కారు కాదు..రోడ్డుపై నడిచే రాజమహల్..కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ వచ్చేసింది.

Mercedes-Benz S-Class: ఇది కారు కాదు..రోడ్డుపై నడిచే రాజమహల్..కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ వచ్చేసింది.
X

Mercedes-Benz S-Class: లగ్జరీ కార్ల ప్రపంచంలో రారాజుగా వెలుగొందే మెర్సిడెస్ బెంజ్, తన సరికొత్త అప్‌డేటెడ్ ఎస్-క్లాస్ మోడల్‌ను భారత మార్కెట్లోకి విసిరింది. ఇది కేవలం కారు మాత్రమే కాదు, రోడ్డుపై వెళ్లే ఒక ఫైవ్ స్టార్ హోటల్ అని చెప్పవచ్చు. అడ్వాన్సుడ్ ఫీచర్లు, అద్భుతమైన డిజైన్, మునుపెన్నడూ లేని భద్రతా ప్రమాణాలతో వచ్చిన ఈ కారు ధరకు తగ్గట్టుగానే రాజసంగా కనిపిస్తోంది. భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర సుమారు రూ.1.78 కోట్ల నుంచి రూ.1.80 కోట్ల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండనుంది.

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ బయటి వైపు నుంచి ఎంత గంభీరంగా కనిపిస్తుందో, లోపల అంతకంటే ఎక్కువ విలాసవంతంగా ఉంటుంది. కారు ముందు భాగంలో భారీ రేడియేటర్ గ్రిల్ ను అమర్చారు, దీనికి ఇప్పుడు కొత్తగా లైటింగ్ ఎఫెక్ట్ ను కూడా ఎంచుకోవచ్చు. దీని డిజిటల్ లైట్ హెడ్ ల్యాంప్స్, ట్విన్-స్టార్ లైట్ సిగ్నేచర్ రాత్రి వేళల్లో కారుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తాయి. బంపర్లు, క్రోమ్ ఎలిమెంట్స్, కొత్త లైటింగ్ గ్రాఫిక్స్ ఈ సెడాన్ కు మరింత రాయల్ లుక్ ను జోడించాయి.

కారు లోపలికి వెళితే.. అది ఒక లగ్జరీ లాంజ్‌లా అనిపిస్తుంది. ఇందులో మెర్సిడెస్ బెంజ్ ఆపరేటింగ్ సిస్టమ్ (MB.OS)ను ప్రవేశపెట్టారు. ఇది ఇన్ఫోటైన్మెంట్, కంఫర్ట్, సేఫ్టీ, డ్రైవింగ్ ఫీచర్లను ఒకే చోట అనుసంధానిస్తుంది. రియర్ సీట్లలో ప్రయాణించే వారి కోసం ఫస్ట్ క్లాస్ కాన్ఫిగరేషన్ అందుబాటులో ఉంది. అంటే వెనుక సీటును కూడా ఒక ఎగ్జిక్యూటివ్ స్పేస్ లా మార్చుకోవచ్చు. దీని కోసం పెద్ద డిస్ ప్లేలు, అధునాతన సీట్ ఫంక్షన్లు, ఆంబియంట్ కంట్రోల్స్ ఉన్నాయి. గాలిని శుభ్రపరిచే ఎయిర్ ఫిల్ట్రేషన్, హీటెడ్ సీట్ బెల్ట్స్ వంటి ఫీచర్లు ఇందులో హైలెట్.

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో పెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. 6-సిలిండర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు పవర్ఫుల్ V8 ఇంజన్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. అన్ని ఇంజన్లు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తాయి, దీనివల్ల కారు స్టార్ట్ అయ్యేటప్పుడు శబ్దం తక్కువగా ఉండటమే కాకుండా వేగం కూడా త్వరగా అందుకుంటుంది. ఇక రైడ్ క్వాలిటీ కోసం 'ఎయిర్ మ్యాటిక్ సప్సెన్షన్' మరియు రోడ్డును స్కాన్ చేసే ఈ-యాక్టివ్ బాడీ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. దీనివల్ల లోపల ఉన్నవారికి గుంతలు, మేకులు ఉన్నా తెలియకుండా హాయిగా నిద్రపోవచ్చు.

భద్రత విషయంలో మెర్సిడెస్ రాజీ పడలేదు. ఇందులో ఏకంగా 15 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి, ఇవి కారులోని ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తాయి. అడ్వాన్స్‌డ్ ప్రీ-సేఫ్ టెక్నాలజీ ప్రమాదాలను ముందే పసిగట్టి ప్రయాణికులను కాపాడుతుంది. అలాగే రియర్-యాక్సిల్ స్టీరింగ్ వల్ల కారును తక్కువ స్పేస్ లో కూడా సులభంగా తిప్పవచ్చు. హై స్పీడ్ లో వెళ్తున్నప్పుడు కారు అటు ఇటు ఊగకుండా చాలా స్థిరంగా ఉంటుంది. లగ్జరీతో పాటు గరిష్ట భద్రత కోరుకునే ధనవంతులకు ఈ కారు ఒక సరైన ఛాయిస్.

Tags

Next Story