MG Astor : MG ఆస్టర్ కొనాలనుకుంటున్నారా? అయితే జేబుకు చిల్లు పడాల్సిందే.

MG Astor : ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ ఇండియా, తన ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ ఎంజీ ఆస్టర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ ధరలు నిన్నటి నుంచే (జనవరి 13, 2026) అమలులోకి వచ్చాయి. అన్ని వేరియంట్లపై దాదాపు రూ.14,100 వరకు పెంచారు. అంటే పాత ధరతో పోలిస్తే 1.46 శాతం భారం పెరిగింది. ఇప్పుడు ఈ కారు ప్రారంభ ధర రూ.9,79,100 నుంచి రూ.15,30,100 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లకు ఆస్టర్ గట్టి పోటీనిస్తోంది.
ఎంజీ ఆస్టర్ కేవలం లుక్ పరంగానే కాదు, పర్ఫార్మెన్స్ పరంగానూ అద్భుతంగా ఉంటుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన హైబ్రిడ్ సిస్టమ్ ఉంది. ఇది ఏకంగా 196 పీఎస్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 8.7 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఈ కారు మైలేజ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక లీటర్ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో 1.83 kWh లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు, ఇది ప్రత్యేక పరిస్థితుల్లో పూర్తి ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచేలా చేస్తుంది.
ఆస్టర్ ఇంటీరియర్ చూస్తే మీరు ఫిదా అయిపోతారు. 12.3 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రయాణాన్ని మరింత విలాసవంతంగా మారుస్తాయి. సేఫ్టీ విషయంలోనూ ఎంజీ తగ్గేదే లే అంటోంది. ఇందులో లెవల్-2 అడాస్ ఫీచర్లు ఉన్నాయి. ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి 10కి పైగా అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 360 డిగ్రీల కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా లభిస్తాయి.
ఈ కారు స్పోర్టీ లుక్‌తో యువతను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఎల్ఈడీ హెడ్ లాంప్స్, స్టైలిష్ డీఆర్ఎల్స్, 18 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ కారుకు మంచి రాజసాన్ని ఇస్తాయి. వెనుక వైపు ట్రయాంగులర్ ఎల్ఈడీ టెయిల్ లాంప్స్, డ్యూయల్ టోన్ బంపర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రూఫ్ రైల్స్, విండోస్ మీద క్రోమ్ ఫినిషింగ్ వంటివి ఈ ఎస్‌యూవీకి ప్రీమియం లుక్‌ను జతచేస్తాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

