MG Starlight : మహీంద్రా ఎక్స్‌యూవీకి చుక్కలే.. ఎంజీ నుంచి సరికొత్త 'స్టార్‌లైట్' హైబ్రిడ్ ఎస్‌యూవీ.

MG Starlight : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కంపెనీ నుంచి రాబోతున్న సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీ స్టార్‌లైట్ మరోసారి రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ముంబై-ఆగ్రా హైవేపై ఇండోర్ సమీపంలో ఈ కారును పరీక్షస్తుండగా మీడియా కంటపడింది. దీనిని బట్టి చూస్తుంటే ఎంజీ తన తదుపరి పెద్ద ప్రాజెక్టును వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ కారుకు స్టార్‌లైట్ 560 అనే పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇటీవలే తన లగ్జరీ మోడల్ మెజెస్టర్ గ్లింప్స్‌ను విడుదల చేసిన ఎంజీ, ఇప్పుడు ఈ హైబ్రిడ్ మోడల్‌తో వార్తల్లో నిలిచింది. 2027 నాటికి భారత మార్కెట్లో వరుసగా హైబ్రిడ్ కార్లను లాంచ్ చేస్తామని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగానే ఈ స్టార్‌లైట్ ఎస్‌యూవీ రాబోతోంది. మార్కెట్లోకి వచ్చాక దీనికి ప్రధాన పోటీదారుగా మహీంద్రాకు చెందిన పాపులర్ ఎస్‌యూవీ XUV 7XO నిలవనుంది. మహీంద్రా కోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా ఎంజీ ఈ కారును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది.
డిజైన్ విషయానికి వస్తే.. టెస్టింగ్ సమయంలో కారుకు కవర్లు ఉన్నప్పటికీ దాని ఆకారం చాలా బలంగా, భారీగా ఉన్నట్లు కనిపించింది. పొడవైన బాడీ, వెడల్పుగా ఉన్న టైర్లు రోడ్డుపై ఈ కారుకు మంచి రాజసాన్ని ఇస్తాయి. ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉండబోతోంది. అంటే పైన సన్నని డీఆర్‌ఎల్‌లు, కింద మెయిన్ లైట్లు ఉంటాయి. వెనుక వైపు కారు మొత్తాన్ని కవర్ చేసేలా ఉండే ఫుల్-విడ్త్ ఎల్‌ఈడీ లైట్ బార్ దీనికి మోడ్రన్ లుక్‌ను ఇస్తుంది. పెద్ద అల్లాయ్ వీల్స్, బాక్సీ డిజైన్ దీనిని ప్రీమియం ఎస్‌యూవీగా నిలబెట్టనున్నాయి.
ఇక లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే, ఎంజీ తన మిగతా కార్ల లాగే ఇందులోనూ ఫీచర్ల వర్షం కురిపించనుంది. ఇతర పోటీ కార్ల కంటే దీని వీల్‌బేస్ 60 మిమీ ఎక్కువగా ఉండటం వల్ల లోపల కాళ్లు చాపుకుని కూర్చోవడానికి చాలా స్థలం దొరుకుతుంది. 12.8 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, కూలింగ్ ఇచ్చే వెంట్లేటెడ్ సీట్లు, సేఫ్టీ కోసం అడాస్ (ADAS) వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ ప్రియులకు ఈ కారు ఒక పండగలా ఉండనుంది.
ఇంజిన్ విషయానికి వస్తే, పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో ఇది లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ సుమారు 197 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తూ, అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో పాటు అదిరిపోయే మైలేజీని కూడా ఇస్తుంది. గుజరాత్‌లోని ప్లాంట్‌లో కొత్త మోడళ్ల తయారీ కోసం ఎంజీ భారీ మార్పులు చేస్తోంది. మొత్తానికి స్టైల్, స్పేస్, టెక్నాలజీల కలయికగా రాబోతున్న ఎంజీ స్టార్‌లైట్, ఎస్‌యూవీ ప్రియులకు ఒక మంచి ఆప్షన్ కాబోతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
