MG Motor : ఎంజీ మోటార్స్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఒక్కసారి ఫుల్ చేస్తే 1,100 కిమీ ప్రయాణం.

MG Motor : భారతదేశ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనానికి JSW ఎంజీ మోటార్ ఇండియా సిద్ధమైంది. భవిష్యత్తులో కేవలం పెట్రోల్ కార్ల మీదనే కాకుండా, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల మీద ఫోకస్ చేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. రాబోయే రోజుల్లో తమ మొత్తం అమ్మకాల్లో 75 శాతం వాటా ఈవీలు, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్ల నుంచే రావాలని ఎంజీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలోనే 2026 చివరి నాటికి ఒక పవర్‌ఫుల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీని, 2027లో సరికొత్త ఆస్టర్, జెడ్ఎస్ ఈవీలను లాంచ్ చేయబోతోంది.
రాబోయే కొత్త కార్లన్నీ సరికొత్త సిగ్మా ప్లాట్‌ఫారమ్‌పై రూపొందనున్నాయి. దీనిని ఎంజీ మాతృ సంస్థ SAIC మోటార్ డెవలప్ చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది 9 రకాల పవర్‌ట్రెయిన్లను, 18 రకాల కాంబినేషన్లను సపోర్ట్ చేస్తుంది. అంటే దీనిపై ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పెట్రోల్ ఇలా ఏ రకమైన కారునైనా తయారు చేయవచ్చు. ఈ టెక్నాలజీ వల్ల కారు బయట చూడటానికి కాంపాక్ట్‌గా ఉన్నా, లోపల మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో 5G కనెక్టివిటీ, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్ వంటి లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లు కూడా ఉంటాయి.
ఎంజీ కంపెనీ ప్రస్తుతం 560 అనే కోడ్‌నేమ్‌తో ఒక కొత్త ఎస్‌యూవీని తయారు చేస్తోంది. ఇది చైనాలో పాపులర్ అయిన వులింగ్ స్టార్‌లైట్ 560 మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. దీని ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది రెండు కలిపి 197 BHP పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీని అతిపెద్ద హైలైట్ ఏంటంటే.. ఫుల్ ట్యాంక్ పెట్రోల్, ఫుల్ ఛార్జింగ్‌తో ఏకంగా 1,100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది 0 నుంచి 100 కిమీ వేగాన్ని కేవలం 9.7 సెకన్లలోనే అందుకుంటుంది.
ఈ కొత్త ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ మార్కెట్లోకి వస్తే.. మహీంద్రా XUV 7XO, టాటా సఫారి వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం. అయితే, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఈ కారు ధర సాధారణ కార్ల కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పెట్రోల్ టెన్షన్ లేకుండా, ఎలక్ట్రిక్ కారులాంటి మైలేజ్ కోరుకునే వారికి ఈ కారు ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది. 2027లో రాబోయే కొత్త ఆస్టర్, జెడ్ఎస్ ఈవీలు కూడా లగ్జరీ ఇంటీరియర్స్ మరియు అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
