IRCTC : పండుగల సీజన్‌లో ఊరు వెళ్లాలా.. త్కాల్ లేకుండానే సేమ్ డే టికెట్ బుకింగ్.. ఎలా అంటే

IRCTC : ఇంటికి దూరంగా ఉంటూ, దీపావళి, ఛట్ పండుగలకు మీ ఇంటికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? పండుగల సీజన్‌లో ఆఫీస్ నుండి సెలవులు దొరకడం కంటే, రైలు టికెట్ దొరకడమే పెద్ద కష్టంగా మారుతుంది. ఈసారి కూడా దీపావళికి సరిగ్గా రెండు రోజుల ముందు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ డౌన్ అవ్వడంతో చాలా మంది తత్కాల్ టికెట్‌లను బుక్ చేసుకోలేకపోయారు. మీరు కూడా అదే లిస్ట్‌లో ఉంటే, టెన్షన్ పడకండి. తత్కాల్ బుకింగ్ లేకుండానే అదే రోజు ప్రయాణానికి టికెట్ ఎలా పొందాలో స్టెప్-బై-స్టెప్ ఇక్కడ తెలుసుకుందాం.
తత్కాల్ సేవ అందుబాటులో లేకపోయినా లేదా టిక్కెట్‌లు అయిపోయినా అదే రోజు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆఫ్‌లైన్, మరొకటి ఆన్‌లైన్. ఆఫ్‌లైన్‌లో టికెట్ బుకింగ్ చేసుకోవాలనుకునే ప్రయాణికులకు, అదే రోజు ప్రయాణం కోసం ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్‌కు వెళ్లడం కొన్నిసార్లు మెరుగ్గా పని చేస్తుంది. అయితే, మీరు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌ని ఉపయోగించి కూడా అదే రోజు ప్రయాణానికి టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. అయితే, ఆ రైలులో టికెట్‌లు అందుబాటులో ఉండాలి.
ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసుకునే విధానం
తత్కాల్ సేవ లేకుండా అదే రోజు రైలు టికెట్ బుక్ చేసుకోవడానికి, ఈ క్రింది పద్ధతిని ఫాలో అవ్వండి. ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌కు వెళ్లి మీ యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. మీరు వెళ్లాలనుకుంటున్న స్టేషన్‌ను, ప్రయాణ తేదీని (అదే రోజు తేదీని) ఎంచుకుని సబ్మిట్ చేయండి. ఆ రూట్‌లో నడుస్తున్న రైళ్ల జాబితా కనిపిస్తుంది. మీకు నచ్చిన రైలుపై క్లిక్ చేసి, రూట్ టైమింగ్‌ను చూడండి. క్లాస్ టైప్‌పై (స్లీపర్, 3ఏసీ, 2ఏసీ వంటివి) క్లిక్ చేయండి. ఇది ఒక వయోజనుడికి అయ్యే ఛార్జీ అవుతుంది. ఇందులో ఐఆర్‌సీటీసీ సర్వీస్ ఛార్జ్ కూడా ఉంటుంది. ఎంచుకున్న రైలులో, క్లాస్‌పై క్లిక్ చేసి సీట్లు అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. అవైలబుల్ సెక్షన్‌లో "Book Now" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. వేరే రైలు కావాలంటే "రీసెట్" క్లిక్ చేయవచ్చు.
ప్రయాణ వివరాలు, పేమెంట్స్
బుకింగ్ పేజీలో, రైలు పేరు, స్టేషన్‌ను మరోసారి సరిచూసుకోండి. ఆ తర్వాత ప్రయాణికుడి పేరు, వయస్సు, లింగం, బెర్త్ ప్రాధాన్యత (అప్పర్/లోయర్) వంటి వివరాలను ఫిలప్ చేయండి. అన్ని వివరాలు సరిగ్గా నింపిన తర్వాత "Pay" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆపై బ్యాంక్ సురక్షిత చెల్లింపు పేజీకి వెళ్లి మీ పేమెంట్ పూర్తి చేయండి. ఈ విధంగా, మీరు తత్కాల్ బుకింగ్ లేకుండా కూడా పండుగల సీజన్‌లో మీ ఇంటికి వెళ్లడానికి టికెట్‌ను ప్రయత్నించవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com