Moto G45 5G : మోటరోలా నుంచి బడ్జెట్ ఫోన్లు .. రూ.10 వేలకే జీ45

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరొలా ‘జీ’ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో జీ45 5జీ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, ఐపీ52 రేటింగ్‌తో కంపెనీ ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది. మోటో జీ45 5జీ రెండు వేరియంట్లో లభిస్తుంది. 4జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.10,999కాగా.. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది. బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్, వివా మెజెంటా రంగుల్లో లభిస్తాయి. ఆగస్టు 28 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. మోటోరొలా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేయొచ్చు. యాక్సిస్‌బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ప్రారంభ ఆఫర్ కింద రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com