New Airline : విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ

New Airline : విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ
X

దేశ విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ ప్రవేశించబోతోంది. దేశీయంగా విమాన సర్వీసులు నడిపేందుకు శంఖ్‌ ఎయిర్‌కు పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ నుంచి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగించనున్నట్లు శంఖ్ ఎయిర్‌ పేర్కొంది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాలతో పాటు డైరెక్ట్‌ సర్వీసులు తక్కువగా ఉన్న మార్గాల్లో సేవలు అందించనున్నట్లు పేర్కొంది. ఎఫ్‌డీఐ, సెబీ వంటి నియంత్రణ సంస్థల నుంచి కూడా ఆమోదం పొందాల్సి ఉంటుందని పౌర విమానయాన శాఖ తెలిపింది.

Tags

Next Story