New Honda City 2028: సరికొత్త డిజైన్, ప్లాట్‌ఫామ్‌తో చరిత్ర సృష్టించబోతున్న హోండా.

New Honda City 2028: భారతదేశంలో ఒకప్పుడు సెడాన్ కార్లకు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు తగ్గింది. అయినప్పటికీ హోండా సిటీ వంటి కొన్ని మోడల్స్ ఇప్పటికీ మార్కెట్లో తమ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. మళ్లీ అమ్మకాల జోరు పెంచాలనే లక్ష్యంతో, హోండా కార్స్ ఇండియా 2028లో ఆరవ జనరేషన్ హోండా సిటీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈసారి కేవలం ఫీచర్లే కాదు, కారు లుక్స్, తయారీ ప్లాట్‌ఫామ్‌లో కూడా అతిపెద్ద మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

కొత్త తరం హోండా సిటీ కారును పూర్తిగా కొత్త పీఎఫ్2 మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌ పై తయారు చేయనున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఇటీవల హోండా ఆటోమోటివ్ టెక్నాలజీ వర్క్‌షాప్‌లో ప్రవేశపెట్టారు. ఈ కొత్త ఆర్కిటెక్చర్ మరింత బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది ప్రస్తుత మోడల్ కంటే 90 కిలోల వరకు తక్కువ బరువు కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇది పూర్తిగా మాడ్యులర్ కావడంతో, కారు తయారీ, ఉత్పత్తి ప్రక్రియ మెరుగుపడుతుంది.. అంతేకాకుండా తయారీ ఖర్చు కూడా తగ్గుతుంది.

కొత్త హోండా సిటీ (2028) డిజైన్ పరంగా చాలా పెద్ద మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త సెడాన్ డిజైన్ ఇటీవల జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించిన హోండా 0 సిరీస్ సెడాన్ కాన్సెప్ట్ నుంచి స్ఫూర్తి పొందే అవకాశం ఉంది. దీనివల్ల నెక్స్ట్ జనరేషన్ సిటీకి సరికొత్త, అధునాతన లుక్ వస్తుంది. 1998లో మొదటిసారిగా లాంచ్ అయిన హోండా సిటీ, భారతదేశంలో హోండా బ్రాండ్‌కు అత్యంత ఎక్కువ కాలం కొనసాగుతున్న మరియు ఐకానిక్ మోడల్స్‌లో ఒకటి.

డిజైన్ , ప్లాట్‌ఫామ్‌లో మార్పులు జరిగినా ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, పెట్రోల్-హైబ్రిడ్ (e-HEV) ఇంజిన్ ఎంపికలతోనే కొత్త మోడల్ కూడా వచ్చే అవకాశం ఉంది. పెట్రోల్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో కొనసాగుతుంది. హైబ్రిడ్ వెర్షన్‌లో eCVT ట్రాన్స్‌మిషన్ యథావిధిగా ఉంటుంది. హోండా సిటీ ప్రస్తుతం ఐదవ తరం మోడల్‌లో ఉంది. ఇటీవల డీజిల్ ఇంజిన్‌ను నిలిపివేసి, 2023 ఫేస్‌లిఫ్ట్‌లో హోండా సెన్సింగ్ (ADAS) వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లను కూడా యాడ్ చేయనుంది.

Tags

Next Story