New Hyundai Venue : మార్కెట్‌లో మంట పెడుతున్న కొత్త ఎస్‌యూవీ.. ఇప్పటికే 32వేల మంది కొనేశారు.

New Hyundai Venue : హ్యుందాయ్ సంస్థ ఇటీవల భారతదేశంలో విడుదల చేసిన న్యూ-జెనరేషన్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కారు లాంచ్ అయిన కేవలం ఒకే నెలలో 32,000 కంటే ఎక్కువ బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది. ఈ అద్భుతమైన స్పందన, ఈ మోడల్‌పై కస్టమర్లలో ఎంతటి ఆసక్తి ఉందో తెలియజేస్తోంది. దీనికి ముఖ్య కారణం దీని సరసమైన ప్రారంభ ధర (రూ.7.90 లక్షలు ఎక్స్-షోరూమ్), కొత్త డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్లే.
డిజైన్, ప్లాట్‌ఫామ్ అప్‌డేట్స్
న్యూ-జెనరేషన్ వెన్యూను హ్యుందాయ్ గ్లోబల్ K1 ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఈ కొత్త మోడల్ ఎత్తుగా, వెడల్పుగా, 2,520 మిమీ పొడవైన వీల్‌బేస్‌తో రూపొందించబడింది. దీనివల్ల కారు లోపల ఎక్కువ స్థలం లభిస్తుంది. వెన్యూ, హ్యుందాయ్ కొత్త డిజైన్ థీమ్‌ను అనుసరిస్తుంది. ఇందులో డార్క్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, క్వాడ్-బీమ్ LED హెడ్‌ల్యాంప్స్, ట్విన్-హార్న్ LED DRLలు, హారిజోన్-స్టైల్ LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఎస్‌యూవీ ఆరు మోనోటోన్, డు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో కొత్తగా హేజిల్ బ్లూ, మిస్టిక్ సఫైర్, డ్రాగన్ రెడ్ వంటి షేడ్స్ ఉన్నాయి.
హైటెక్ ఫీచర్లు, ఇంటీరియర్
కొత్త వెన్యూ లోపల పూర్తిగా కొత్త డిజైన్, ప్రీమియం టచ్‌తో కనిపిస్తుంది. ఇందులో NVIDIA 12.3-అంగుళాల పనోరమిక్ డిస్‌ప్లే ఉంది. ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, న్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌గా పనిచేస్తుంది. ఫీచర్ల జాబితాలో పెద్ద మార్పు లెవెల్ 2 ADAS సూట్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) చేర్చడం. ఇంకా టెర్రాజో-టెక్స్‌చర్డ్ ప్యాడ్, డ్యూయల్-టోన్ లెదరెట్ సీట్లు, ఎలక్ట్రిక్ 4-వే డ్రైవర్ సీట్, 2-స్టెప్ రిక్లైనింగ్ రియర్ సీట్లు, బోస్ 8-స్పీకర్ ఆడియో సిస్టమ్, స్మార్ట్ అరోమా డిఫ్యూజర్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
ఇంజన్ ఆప్షన్లు, పవర్
కొత్త హ్యుందాయ్ వెన్యూను కంపెనీ మొత్తం మూడు రకాల పవర్ఫుల్ ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో మొదటిది 1.2-లీటర్ కప్పా MPi పెట్రోల్ ఇంజన్, ఇది 83bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో జత చేయబడింది. రెండవది మరింత పవర్ఫుల్ 1.0-లీటర్ కప్పా టర్బో GDi పెట్రోల్ ఇంజన్, ఇది 120bhp పవర్‌ను అందిస్తుంది. వినియోగదారులు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా అత్యంత వేగవంతమైన 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
ఇక డీజిల్ ప్రియుల కోసం, 1.5-లీటర్ U2 CRDi డీజిల్ ఇంజన్ అందుబాటులో ఉంది, ఇది 116bhp పవర్‌ను ఇస్తుంది. ఈ డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా కొత్తగా చేర్చబడిన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. అదనంగా స్పోర్టియర్ లుక్, అనుభూతినిచ్చే ఎన్ లైన్ (N Line) వేరియంట్‌లో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పాటు డ్రైవ్, ట్రాక్షన్ కంట్రోల్ మోడ్‌ల కోసం ప్యాడిల్ షిఫ్టర్‌లు కూడా అందించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

