New Kia Seltos 2026 : కియా సెల్టోస్ కొత్త అవతార్ వచ్చేసింది..కేవలం రూ.10.99 లక్షలకే లగ్జరీ ఫీచర్లు.

New Kia Seltos 2026 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కియా మోటార్స్ తన పాపులర్ ఎస్‌యూవీ సెల్టోస్ కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త డిజైన్, అదిరిపోయే ఫీచర్లు, మరింత పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో ఈ కారు రూ.10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి విక్టోరిస్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా కియా ఈ మోడల్‌ను సిద్ధం చేసింది.
కొత్త కియా సెల్టోస్ మునుపటి మోడల్ కంటే మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తోంది. దీని ఫ్రంట్ లుక్ పూర్తిగా మారిపోయింది. కొత్త గ్రిల్, నిలువుగా ఉండే ఎల్ఈడి హెడ్ లాంప్స్, అద్భుతమైన డిజైన్‌తో కూడిన డిఆర్ఎల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. కారు వెనుక భాగంలో వెడల్పైన ఎల్ఈడి టెయిల్ లైట్లు ఉన్నాయి, ఇవి మధ్యలో ఒక లైట్ బార్‌తో అనుసంధానించబడి ఉంటాయి. కారు మొత్తం సైజులో స్వల్ప మార్పులు చేసిన కియా, రోడ్డుపై ఇది పక్కా ఎస్‌యూవీలా కనిపించేలా బాక్సీ లుక్‌ను ఇచ్చింది.
లోపలికి అడుగుపెడితే, డ్యాష్‌బోర్డ్ డిజైన్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. పూర్తి డిజిటల్ అనుభవాన్ని అందించేలా ఒకే ప్యానెల్‌లో ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. కారు తయారీలో వాడిన మెటీరియల్ క్వాలిటీ కూడా మునుపటి కంటే చాలా బాగుంది. కొత్త ప్లాట్‌ఫారమ్ కారణంగా లోపల స్పేస్ పెరిగింది, దీనివల్ల వెనుక కూర్చునే ప్రయాణికులకు కాళ్లు చాచుకోవడానికి ఎక్కువ స్థలం లభిస్తుంది.
లగ్జరీ కార్లలో మాత్రమే కనిపించే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS Level-2)ను ఇందులో ప్రవేశపెట్టారు. పనోరమిక్ గ్లాస్ రూఫ్, బోస్ (Bose) సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్ప్లే వంటి ఎన్నో హై-టెక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీకి పెద్దపీట వేస్తూ.. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS తో కూడిన EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్‌లను స్టాండర్డ్ ఫీచర్లుగా కియా మోటార్స్ అందిస్తోంది.
కొత్త సెల్టోస్‌లో మూడు ఇంజిన్ ఆప్షన్లను కియా ఇస్తోంది.
1.5 లీటర్ పెట్రోల్: 113bhp పవర్, 144Nm టార్క్ ఇస్తుంది. దీనితో పాటు CVT గేర్‌బాక్స్ లభిస్తుంది.
1.5 లీటర్ టర్బో పెట్రోల్: ఇది స్పీడ్ ప్రియుల కోసం. 158bhp పవర్, 253Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది.
1.5 లీటర్ డీజిల్: 118bhp, 260Nm టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఇది లభిస్తుంది.
ఇప్పటికే కియా డీలర్లు రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ స్వీకరిస్తున్నారు. సెల్టోస్ రాకతో మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో పోటీ వేడెక్కింది. ముఖ్యంగా హ్యుందాయ్ క్రెటా ఏళ్ల తరబడి ఏలుతున్న మార్కెట్‌లోకి సెల్టోస్ మరింత అగ్రెసివ్ ధరతో రావడంతో కస్టమర్లు ఏ వైపు మొగ్గు చూపుతారో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

