New Maruti Brezza 2026 : వచ్చేస్తోంది కొత్త మారుతి బ్రెజా.. ఇంటీరియర్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

New Maruti Brezza 2026 : వచ్చేస్తోంది కొత్త మారుతి బ్రెజా.. ఇంటీరియర్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
X

New Maruti Brezza 2026 : మారుతి సుజుకి తన మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ బ్రెజాను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. 2022లో వచ్చిన సెకండ్ జనరేషన్ మోడల్‌కు ఇది ఒక ప్రధాన అప్‌డేట్‌గా ఉండబోతోంది. ఇటీవల రోడ్లపై టెస్టింగ్ చేస్తున్న సమయంలో కనిపించిన ఈ కారు ఫీచర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇంటీరియర్‌లో లగ్జరీ ఫీచర్లు, మెకానికల్ మార్పులు ఈసారి బ్రెజాను మరింత పవర్ఫుల్ గా మార్చబోతున్నాయి.

కొత్త బ్రెజా వెలుపలి డిజైన్‌లో కొన్ని ఆసక్తికరమైన మార్పులు ఉన్నాయి. కారు ముందు భాగంలో మరింత దూకుడుగా ఉండే బంపర్, కొత్త గ్రిల్, షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉండనున్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో బరువైన క్లాడింగ్‌ను తీసివేసి, సన్నని బ్లాక్ స్ట్రిప్‌ను చేర్చారు. ఇది కారుకు ప్రీమియం లుక్ ఇస్తోంది. వెనుక భాగంలో కూడా ఆధునిక ట్రెండ్‌కు అనుగుణంగా కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ వచ్చే అవకాశం ఉందని కొన్ని లీకైన చిత్రాలు సూచిస్తున్నాయి.

లోపల అడుగుపెడితే, ఈసారి బ్రెజా సెగ్మెంట్లోనే బెస్ట్ ఫీచర్లతో అలరించనుంది.

పెద్ద టచ్‌స్క్రీన్: ఇందులో 10.25 అంగుళాల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది.

వెంటిలేటెడ్ సీట్లు: వేసవిలో ప్రయాణికులకు చల్లదనాన్నిచ్చే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఈ మోడల్‌లో ప్రధాన ఆకర్షణ.

ప్రీమియం క్యాబిన్: వైట్ ఎలిమెంట్స్‌తో కూడిన డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్ కారుకు మరింత రిచ్ లుక్ ఇస్తుంది.

ఇతర ఫీచర్లు: సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), వైర్‌లెస్ ఛార్జింగ్, అంబియంట్ లైటింగ్ వంటి లగ్జరీ ఫీచర్లు కొనసాగుతాయి.

ఇంజన్ విషయంలో మారుతి ఒక పెద్ద సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతమున్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు, ఈసారి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వచ్చే అవకాశం ఉంది. హైవేలపై ప్రయాణించే వారికి ఇది మంచి మైలేజీని, స్మూత్ డ్రైవింగ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా, ఫ్రాంక్స్ నుంచి 1.0-లీటర్ టర్బో ఇంజన్‌ను కూడా బ్రెజాలోకి తెచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

సాధారణంగా సీఎన్‌జీ కార్లలో సిలిండర్ వల్ల సామాను పెట్టుకోవడానికి స్థలం ఉండదు. దీనికి పరిష్కారంగా మారుతి తన కొత్త విక్టోరిస్ మోడల్ లాగే బ్రెజాలో కూడా అండర్ బాడీ సీఎన్‌జీ ట్యాంక్ టెక్నాలజీని వాడుతోంది. అంటే ట్యాంక్ కారు బాడీ కింద ఉంటుంది కాబట్టి డిక్కీలో పూర్తి స్థలం లభిస్తుంది.

Tags

Next Story