Insurance Policies : బీమా పాలసీలకు కొత్త రూల్స్
జీవిత బీమా ప్రీమియంలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో బీమా ప్రీమియం పెరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లేదంటే ఏజెంట్ల కమీషన్‌లో కోత పడే సూచనలు కనిపిస్తున్నాయి. మెరుగైన సరెండర్ వాల్యూ అందించాలన్న బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ ఆదేశాలు మంగళవారం నుంచి అమల్లోకి రానుండడం ఇందుకు నేపథ్యం. జీవిత బీమా తీసుకునే వారిలో కొందరు గడువు ముగియక ముందే తమ పాలసీ రద్దు చేసుకుంటారు. దీన్నే బీమా పరిభాషలో సరెండర్ అంటారు. అయితే, ఈ సరెండర్ విలువకు సంబంధించి బీమా నియంత్ర, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొన్ని నెలల క్రితం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. పాలసీని సరెండర్ చేస్తే మెరుగైన విలువను ఇవ్వాలని పేర్కొంది. ఆ మొత్తం సహేతుకంగా, సొమ్ముకు తగిన ప్రతిఫలం ఉండాలని పేర్కొంది.ఐఆర్‌డీఏఐ ఆదేశాలు పాటించాలంటే అటు బీమా ప్రీమియం పెంచడం గానీ, ఏజెంట్లకు చెల్లించే కమీషన్‌ను తగ్గించడం బీమా కంపెనీల ముందు ఉన్న ఐచ్ఛికాలని ప్రైవేటు రంగ బీమా కంపెనీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ ఆదేశాల వల్ల కమీషన్ విధానంలో చాలా వరకు మార్పులు రాబోతన్నాయని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ డైరెక్టర్ గౌరవ్ దీక్షిత్ పేర్కొన్నారు. ప్రీమియంలోనూ మార్పులు రాబోతున్నాయని చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com