Hyundai Creta : చిన్న కార్లే కాదు..పెద్ద SUVలే భయపడాలి..హ్యుందాయ్ కొత్త ప్లాన్ మామూలుగా లేదు.

Hyundai Creta : హ్యుందాయ్ మోటార్స్ అత్యధికంగా అమ్ముడవుతున్న SUV క్రెటాను సరికొత్తగా ముస్తాబు చేస్తోంది. 2026 ప్రారంభంలోనే అద్భుతమైన అమ్మకాలతో టాటా, మారుతి సుజుకికి షాక్ ఇచ్చిన క్రెటా, ఇప్పుడు 2027 నాటికి నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది మార్కెట్లోకి వస్తే పోటీదారుల ఆటలు సాగవని విశ్లేషకులు చెబుతున్నారు. నెక్స్ట్ జనరేషన్ క్రెటా (కోడ్ నేమ్: SX3i) ప్రస్తుత మోడల్ కంటే పొడవుగా, వెడల్పుగా ఉండబోతోంది. ఇది కియా సెల్టోస్ కొత్త ప్లాట్‌ఫారమ్ (K3) ఆధారంగా తయారవుతుందని సమాచారం. రోడ్డుపై మరింత గాంభీర్యాన్ని ఇచ్చేలా 19-అంగుళాల భారీ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్, వైడర్ టైర్లను (235/45 సెక్షన్) దీనికి అమర్చబోతున్నారు. దీనివల్ల కారుకు ప్రీమియం లుక్ రావడమే కాకుండా, లోపల స్పేస్ కూడా పెరుగుతుంది.
కొత్త క్రెటాలో రాబోతున్న అతిపెద్ద మార్పు హైబ్రిడ్ ఇంజిన్. హ్యుందాయ్ తన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో అప్‌డేట్ చేయనుంది. ఇది లీటరుకు సుమారు 25 నుంచి 28 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి కార్లు హైబ్రిడ్ విభాగంలో దూసుకుపోతున్నాయి, వాటికి చెక్ పెట్టడమే హ్యుందాయ్ ప్రధాన లక్ష్యం.
లోపలి భాగంలో లగ్జరీ కార్లను తలపించేలా 12.3-అంగుళాల కర్వ్డ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్ వచ్చే ఛాన్స్ ఉంది. అదనంగా:
Level 2 ADAS: మరింత మెరుగుపరిచిన సేఫ్టీ ఫీచర్లు.
బాస్ మోడ్ : వెనుక కూర్చునే వారు ముందు సీటును సర్దుబాటు చేసుకునే సౌకర్యం.
డ్యాష్‌క్యామ్, సెన్సార్స్: కారుకు ముందు, వెనుక బిల్ట్-ఇన్ డ్యాష్‌క్యామ్స్, సైడ్ పార్కింగ్ సెన్సార్స్.
10-వే అడ్జస్టబుల్ సీట్లు: డ్రైవర్ సౌకర్యం కోసం ప్రత్యేకమైన అడ్జస్ట్‌మెంట్స్.
జనవరి 2026లో కూడా హ్యుందాయ్ క్రెటా 17,921 యూనిట్ల అమ్మకాలతో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టాటా సియెర్రా (7,003 యూనిట్లు), మారుతి విక్టోరిస్ (15,240 యూనిట్లు) వంటి కొత్త కార్లను కూడా ఇది వెనక్కి నెట్టింది. 2027లో వచ్చే కొత్త వెర్షన్ ఈ గ్యాప్‌ను మరింత పెంచడం ఖాయం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
