Nissan Gravite : మధ్యతరగతి ఫ్యామిలీలకు పండగే..నిస్సాన్ నుంచి అదిరిపోయే 7-సీటర్ కారు.

Nissan Gravite : భారతదేశంలో బడ్జెట్ ధరలో ఫ్యామిలీ కార్ల కోసం చూసే వారి సంఖ్య చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా 7 సీటర్ కార్లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నిస్సాన్ ఇండియా తన అమ్ములపొదిలో నుంచి మరో సరికొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. అదే నిస్సాన్ గ్రావైట్. అదిరిపోయే ఫీచర్లు, తక్కువ ధరతో ఈ నెలలోనే మార్కెట్లోకి రావడానికి ఇది సిద్ధంగా ఉంది.
భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు నిస్సాన్ కంపెనీ గ్రావైట్ పేరుతో ఒక సరికొత్త ఎంపీవీని లాంచ్ చేస్తోంది. ఈ కారును అధికారికంగా గ్రావైట్ అని పిలుస్తారు. ఈ కారు ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారిని ఉద్దేశించి డిజైన్ చేయబడింది. మారుతి ఎర్టిగా, రెనాల్ట్ ట్రైబర్ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెలలోనే ఇది రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి.
రెనాల్ట్-నిస్సాన్ భాగస్వామ్యంలో భాగంగా.. ఈ నిస్సాన్ గ్రావైట్ కారును రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫారమ్ మీదనే నిర్మిస్తున్నారు. అంటే ఇది 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండి, సిటీ డ్రైవింగ్ కు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ట్రైబర్ తో పోలిస్తే దీని స్టైలింగ్, బ్రాండింగ్, ఫీచర్లు చాలా ప్రీమియంగా ఉండబోతున్నాయి. నిస్సాన్ తన సిగ్నేచర్ గ్రిల్, కొత్త బంపర్, సరికొత్త ఎల్ఈడీ లైటింగ్ తో దీనికి ఒక యూనిక్ లుక్ ఇవ్వనుంది.
గ్రావైట్ కారులో ఏడుగురు ప్రయాణించేలా సీటింగ్ అరేంజ్ మెంట్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మూడవ వరుస సీట్లను అవసరమైనప్పుడు తీసివేసేలా లేదా మడతపెట్టేలా డిజైన్ చేశారు. దీనివల్ల ఎక్కువ లగేజీ ఉన్నప్పుడు కారులో స్పేస్ పెంచుకోవచ్చు. వెనుక సీట్లలో కూర్చునే వారికి కూడా సౌకర్యంగా ఉండేలా రియర్ ఏసీ వెంట్స్, కప్ హోల్డర్స్, స్మార్ట్ స్టోరేజ్ స్పేస్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.
నిస్సాన్ గ్రావైట్ లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండబోతోంది. ఇది మంచి పవర్ తో పాటు మైలేజీని కూడా అందిస్తుంది. ప్రారంభంలో మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ కారు, ఆ తర్వాత ఏఎంటీ (ఆటోమేటిక్) వెర్షన్‌లో కూడా లభించనుంది. లోపల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి హైటెక్ ఫీచర్లు ఉండబోతున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS విత్ EBD, పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు స్టాండర్డ్ గా రానున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

