Nissan Gravite : నేడే నిస్సాన్ గ్రావైట్ గ్రాండ్ ఎంట్రీ..ఎర్టిగా కోటను కూల్చేందుకు బడ్జెట్ 7-సీటర్ వచ్చేస్తోంది.

Nissan Gravite : నేడే నిస్సాన్ గ్రావైట్ గ్రాండ్ ఎంట్రీ..ఎర్టిగా కోటను కూల్చేందుకు బడ్జెట్ 7-సీటర్ వచ్చేస్తోంది.
X

Nissan Gravite : భారతీయ కుటుంబాలకు తక్కువ బడ్జెట్‌లో 7 సీటర్ కారు కావాలంటే ఇప్పటివరకు మారుతి ఎర్టిగా లేదా రెనాల్ట్ ట్రైబర్ మాత్రమే దిక్కుగా ఉండేవి. కానీ ఈ గుత్తాధిపత్యానికి గండి కొట్టేందుకు నిస్సాన్ ఇండియా సిద్ధమైంది. నేడు మార్కెట్లోకి నిస్సాన్ నుంచి సరికొత్త గ్రావైట్ ఎంపీవీ గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. మధ్యతరగతి ప్రజల జేబుకు చిల్లు పడకుండా, అందమైన లుక్‌తో మూడు వరుసల సీటింగ్ సౌకర్యంతో ఈ కారును రూపొందించారు. నిస్సాన్ మాగ్నైట్ సృష్టించిన సంచలనాన్ని ఈ గ్రావైట్ పునరావృతం చేస్తుందని కంపెనీ భారీ ఆశలు పెట్టుకుంది.

నిస్సాన్ గ్రావైట్ ప్రధాన బలం దాని ధర. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, ఈ కారు ప్రారంభ ధర కేవలం రూ.6 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. టాప్ వేరియంట్ కూడా రూ.9 లక్షల లోపే లభించే అవకాశం ఉంది. అంటే ఒక హ్యాచ్‌బ్యాక్ కారు కొనే ధరలోనే ఒక పూర్తి స్థాయి 7 సీటర్ ఎంపీవీని సొంతం చేసుకోవచ్చన్నమాట. ఎర్టిగా ధరతో పోలిస్తే ఇది చాలా తక్కువ కాబట్టి, బడ్జెట్ ప్రియులు కచ్చితంగా గ్రావైట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే కచ్చితమైన ధరల వివరాలు మరికొద్ది గంటల్లో లాంచ్ ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

తక్కువ ధర కదా అని ఫీచర్ల విషయంలో నిస్సాన్ వెనక్కి తగ్గలేదు. కారు లోపల 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. ఏడు మంది ప్రయాణించినా చల్లదనం కోసం ప్రత్యేకంగా రియర్ ఏసీ వెంట్లతో పాటు రూఫ్ మౌంటెడ్ బ్లోయర్లు కూడా ఇచ్చారు. దీనివల్ల మూడో వరుసలో కూర్చున్న వారికి కూడా ఏసీ గాలి బాగా అందుతుంది. టాప్ మోడల్స్‌లో పుష్-బటన్ స్టార్ట్, స్మార్ట్ కీ వంటి సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది. అయితే, ధరను అదుపులో ఉంచడానికి క్రూయిజ్ కంట్రోల్ వంటి ఖరీదైన ఫీచర్లను ఇందులో ఇవ్వకపోవచ్చు.

నిస్సాన్ గ్రావైట్‌లో 1.0 లీటర్, త్రీ-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 72bhp పవర్, 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ పరంగా 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్ కోరుకునే వారికి ఈ ఇంజిన్ చక్కగా సరిపోతుంది. ప్రారంభంలో టర్బో పెట్రోల్ ఆప్షన్ రాకపోయినా, భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని సమాచారం.

గ్రావైట్ ప్రధానంగా మారుతి సుజుకి ఎర్టిగా, రెనాల్ట్ ట్రైబర్, కియా కారెన్స్ (బేస్ మోడల్స్)తో తలపడనుంది. రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫారమ్ మీదనే ఇది రూపొందింది కాబట్టి, నమ్మకమైన నిర్మాణం, ఎక్కువ స్థలం ఇందులో దొరుకుతుంది. నిస్సాన్ బ్రాండ్ ఇమేజ్, మాగ్నైట్ సక్సెస్ ఈ కారుకు కలిసి వచ్చే అంశాలు. తక్కువ బడ్జెట్‌లో ఫ్యామిలీతో కలిసి ప్రయాణించాలనుకునే వారికి నిస్సాన్ గ్రావైట్ ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది.

Tags

Next Story