Nissan Gravite : చరిత్రను తిరగరాసిన నిస్సాన్.. రూ. 5.65 లక్షలకే అదిరిపోయే 7-సీటర్ కారు.

Nissan Gravite : భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు అదిరిపోయే శుభవార్త. నిస్సాన్ ఇండియా తన మోస్ట్ అవేటెడ్ 7-సీటర్ ఎంపీవీ నిస్సాన్ గ్రావైట్ ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రూ.5.65 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చిన ఈ కారు, అతి తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించాలనుకునే ఫ్యామిలీలకు బెస్ట్ ఆప్షన్ కానుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రెనో ట్రైబర్‌కు గట్టి పోటీ ఇచ్చేలా దీనిని రూపొందించారు. గ్రెవైట్ బుకింగ్స్ నేటి నుంచే ప్రారంభమయ్యాయి.
డిజైన్, లుక్స్
నిస్సాన్ గ్రెవైట్ లుక్ చూస్తేనే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో నిస్సాన్ సిగ్నేచర్ వి-మోషన్ గ్రిల్, మెరిసే హెడ్‌ల్యాంప్‌లు, స్టైలిష్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఉన్నాయి. కారు బోనెట్‌పై Gravite అని రాసి ఉన్న బ్యాడ్జింగ్ కారుకు ప్రత్యేకమైన గుర్తింపునిస్తోంది. 15-అంగుళాల కొత్త డిజైన్ అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, వెనుక భాగంలో క్రోమ్ స్ట్రిప్‌తో కూడిన టెయిల్ లైట్లు కారును మరింత అందంగా మార్చాయి.
మైలేజీ, పవర్:
ఈ కారులో 1.0 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఇది 71bhp పవర్, 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక మైలేజీ విషయానికి వస్తే, ఏఎంటీ వెర్షన్ లీటరుకు 19.6 కి.మీ, మాన్యువల్ వెర్షన్ 19.3 కి.మీ మైలేజీ ఇస్తాయని కంపెనీ చెబుతోంది. ఫారెస్ట్ గ్రీన్, ఆనిక్స్ బ్లాక్ వంటి ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది.
నిస్సాన్ గ్రెవైట్ కేవలం తక్కువ ధరకే కాదు, అద్భుతమైన ఫీచర్లతో కూడా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇంటీరియర్ చూస్తే డ్యూయల్ టోన్ ఫినిషింగ్, ప్రీమియం సుయెడ్ మెటీరియల్‌తో చాలా లగ్జరీగా ఉంది. దీనిలోని 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి.
సేఫ్టీ ఫీచర్లు
సేఫ్టీ విషయంలో నిస్సాన్ ఎక్కడా రాజీ పడలేదు. దీనిలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్), టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి. మొదటి 1,000 మంది కస్టమర్లకు ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్ వంటి స్పెషల్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది.
ఫ్లెక్సిబుల్ సీటింగ్
ఈ 7-సీటర్ కారులో మూడవ వరుస సీట్లను అవసరానికి తగ్గట్టుగా ఫోల్డ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎక్కువ లగేజీ పడుతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటో హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు వంటి స్మార్ట్ ఫీచర్లు ఈ బడ్జెట్ కారులో ఉండటం నిజంగా గొప్ప విషయమే. రాబోయే రోజుల్లో దీనిలో సీఎన్‌జీ ఆప్షన్ కూడా తీసుకురావాలని నిస్సాన్ ప్లాన్ చేస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
