Nissan Gravite : రూ.6 లక్షల లోపే 7-సీటర్.. సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా..ఎర్టిగా, కారెన్స్ గుండెల్లో రైళ్లు.

Nissan Gravite : భారతదేశంలో బడ్జెట్ ధరలో లభించే ఎంపీవీల సెగ్మెంట్‌లో నిస్సాన్ మోటార్ ఇండియా తన పట్టును బిగించేందుకు సిద్ధమైంది. రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫారమ్ (CMF-A) ఆధారంగా రూపొందిన ఈ కొత్త నిస్సాన్ గ్రావిటే, అటు స్టైల్ ఇటు పర్ఫార్మెన్స్‌లో ఎక్కడా రాజీ పడకుండా వస్తోంది. 7-సీటర్ లేఅవుట్‌తో రాబోతున్న ఈ కారులో విశాలమైన క్యాబిన్, అడ్జస్టబుల్ సీట్లు ఉండటం వల్ల పెద్ద కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది. ముఖ్యంగా ట్రైబర్ కంటే అదనపు హంగులతో, సరికొత్త డిజైన్ ఎలిమెంట్స్‌తో దీనిని తీర్చిదిద్దారు.
ఈ కారులో లభించే ఫీచర్లు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సుమారు రూ.6 లక్షల ప్రారంభ ధరలోనే సన్‌రూఫ్, 360-డిగ్రీల కెమెరా వంటి హై-ఎండ్ ఫీచర్లను నిస్సాన్ అందిస్తుందని సమాచారం. దీనివల్ల కారును పార్కింగ్ చేయడం సులభం కావడమే కాకుండా, కారుకు ఒక ప్రీమియం లుక్ వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి ఎర్టిగా, కియా కారెన్స్ వంటి కార్లు ఈ ఫీచర్లతో కావాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ నిస్సాన్ సామాన్యుడి బడ్జెట్‌లోనే వీటిని అందుబాటులోకి తెస్తోంది.
ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.0-లీటర్ మూడు-సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది 72 హార్స్‌పవర్, 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా మరింత పవర్ కోరుకునే వారి కోసం 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా నిస్సాన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది దాదాపు 100 హార్స్‌పవర్ శక్తిని అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో ఈ కారు మార్కెట్లోకి రానుంది. మైలేజీ విషయంలో కూడా నిస్సాన్ గ్రావిటే టాప్ క్లాస్‌లో ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ధర విషయానికొస్తే.. రెనాల్ట్ ట్రైబర్ ధర రూ.5.76 లక్షల నుంచి రూ.8.60 లక్షల మధ్య ఉంది. నిస్సాన్ గ్రావిటే కూడా దాదాపు ఇదే ధరలో లేదా అంతకంటే తక్కువ ఆరంభ ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎయిర్ బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ వంటి భద్రతా ఫీచర్లు ప్రామాణికంగా రానున్నాయి. ఫిబ్రవరి 17న జరిగే ఈ లాంచ్ ఈవెంట్‌లో పూర్తి ధరలు, వేరియంట్ల వివరాలు వెల్లడికానున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
