Nissan Magnite 2025 : 6 లక్షల లోపే 5 స్టార్ సేఫ్టీ.. టాటా పంచ్‌కు చెమటలు పట్టిస్తున్న నిస్సాన్ మాగ్నైట్

Nissan Magnite 2025 : తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు, మంచి సేఫ్టీ ఉన్న ఎస్‌యూవీ కోసం చూస్తున్నారా? అయితే నిస్సాన్ ఇండియా అందిస్తున్న నిస్సాన్ మాగ్నైట్ బెస్ట్ ఛాయిస్ కావచ్చు. కేవలం రూ. 5.61 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ కారు, మార్కెట్‌లో టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి పాపులర్ మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది. దీని ధర, మైలేజీ, సేఫ్టీ ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నిస్సాన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. మాగ్నైట్ బేస్ మోడల్ ధర రూ.5,61,643 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇక టాప్-ఎండ్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.9,64,124 వరకు ఉంది. మీరు ఆటోమేటిక్ డ్రైవింగ్ కావాలనుకుంటే.. దీని AMT వేరియంట్లు రూ.6.16 లక్షల నుంచి రూ.8.98 లక్షల మధ్య అందుబాటులో ఉన్నాయి. స్పెషల్ ఎడిషన్ కావాలనుకునే వారి కోసం కురో ఎడిషన్ ధర రూ. 7.59 లక్షల నుండి రూ. 9.93 లక్షల వరకు ఉంది. ఇక ప్రీమియం CVT (ఆటోమేటిక్) వేరియంట్ల ధర రూ. 9.14 లక్షల నుండి రూ. 10.75 లక్షల మధ్యలో ఉంది.
మైలేజీ ఎంత?
ఈ ఎస్‌యూవీలో రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు. పెట్రోల్ (మాన్యువల్) లీటరుకు సుమారు 19.9 కి.మీ. మైలేజీని ఇస్తుంది. పెట్రోల్ (ఆటోమేటిక్) లీటరుకు 19.7 కి.మీ. మైలేజీని అందిస్తుంది. CNG వేరియంట్ కిలో గ్యాస్‌కు 24 కి.మీ. వరకు మైలేజీని ఇస్తుంది.
సేఫ్టీలో టాప్
సాధారణంగా తక్కువ ధర కార్లలో సేఫ్టీ తక్కువగా ఉంటుందనే భయం ఉంటుంది. కానీ మాగ్నైట్ విషయంలో అది అవసరం లేదు. ఈ కారు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇందులో భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగులు, ABS విత్ EBD, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ప్రీమియం ఫీచర్లు
తక్కువ ధరలోనే ఈ కారులో మీకు లగ్జరీ ఫీచర్లు లభిస్తాయి. ఇందులో 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జర్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, 6-స్పీకర్ల ఆడియో సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి హైటెక్ ఫీచర్లు ఉన్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

