Nissan Magnite Offer : టాటా పంచ్‌కు చుక్కలే..5 స్టార్ సేఫ్టీ ఎస్‌యూవీపై నిస్సాన్ భారీ తగ్గింపు.

Nissan Magnite Offer : టాటా పంచ్‌కు చుక్కలే..5 స్టార్ సేఫ్టీ ఎస్‌యూవీపై నిస్సాన్ భారీ తగ్గింపు.
X

Nissan Magnite Offer : నిస్సాన్ ఇండియా తన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ మాగ్నైట్ అమ్మకాలను మరింత పెంచేందుకు సరికొత్త డిస్కౌంట్ ఆఫర్లను ప్రవేశపెట్టింది. జనవరి 2025లో కంపెనీ తన కార్ల ధరలను 3 శాతం పెంచినప్పటికీ, ఇప్పుడు ఇస్తున్న రూ.1.20 లక్షల ప్రయోజనాలు కస్టమర్లకు భారీ లాభాన్ని చేకూర్చనున్నాయి. అయితే ఈ ఆఫర్లను పొందాలనుకునే వారు జనవరి 22 లోపు కారును బుక్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం నిస్సాన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. మాగ్నైట్ ప్రారంభ ధర రూ.5.61 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. పెరిగిన ధరల ప్రభావం కస్టమర్లపై పడకుండా ఉండటానికే కంపెనీ ఈ భారీ డిస్కౌంట్లను ఇస్తోంది.

కంపెనీ ఈ రూ.1.20 లక్షల ప్రయోజనాలను వివిధ రూపాల్లో అందిస్తోంది. ఇందులో నేరుగా ఇచ్చే క్యాష్ డిస్కౌంట్, పాత కారును ఇచ్చి కొత్తది కొనేవారికి ఎక్స్ఛేంజ్ బోనస్, పాత నిస్సాన్ కస్టమర్ల కోసం లాయల్టీ బోనస్, అలాగే కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఆఫర్లు ఉండవచ్చు. వీటితో పాటు స్క్రాపేజ్ బోనస్ కూడా పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్లు వేరియంట్, నగరాన్ని బట్టి మారవచ్చు కాబట్టి, పూర్తి వివరాల కోసం స్థానిక నిస్సాన్ డీలర్‌ను సంప్రదించడం మంచిది.

నిస్సాన్ మాగ్నైట్ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే కారుగా పేరు తెచ్చుకుంది. ఇది కేవలం బడ్జెట్ ఫ్రెండ్లీ మాత్రమే కాదు, చూడటానికి చాలా మస్కులర్ డిజైన్‌తో రోడ్డుపై రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. 205 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల గుంతల రోడ్లపై కూడా ఇది చాలా స్మూత్‌గా ప్రయాణిస్తుంది. లోపల విశాలమైన క్యాబిన్ స్పేస్, 336 లీటర్ల బూట్ స్పేస్ ఉండటం వల్ల ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్స్ వెళ్లడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

మాగ్నైట్ రెండు రకాల పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. మొదటిది 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కాగా, రెండోది మరింత పవర్ ఫుల్ అయిన 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. వీటికి తోడు మైలేజ్ ఎక్కువగా కోరుకునే వారి కోసం కంపెనీ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. గేర్‌బాక్స్ విషయానికొస్తే.. మ్యాన్యువల్, ఏఎమ్‌టీ, సీవీటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో నిస్సాన్ మాగ్నైట్ ఎవరికీ తీసిపోదు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. అడల్ట్ సేఫ్టీలో 5 స్టార్స్ మరియు చైల్డ్ సేఫ్టీలో 3 స్టార్స్ దక్కించుకుని టాటా పంచ్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తోంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్, ఈబీడీ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ప్రామాణికంగా లభిస్తాయి.

Tags

Next Story