Nissan : మాగ్నైట్ తర్వాత మరో మాస్టర్ పీస్..క్రెటాకు గట్టి పోటీ ఇచ్చే నిస్సాన్ కైట్ ఎస్‌యూవీ.

Nissan : కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మాగ్నైట్ ద్వారా భారత మార్కెట్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకున్న నిస్సాన్ కంపెనీ, ఇప్పుడు హ్యుందాయ్ క్రెటా వంటి దిగ్గజ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. నిస్సాన్ సంస్థ తాజాగా కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కైట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. దీని తయారీ ఇప్పటికే బ్రెజిల్‌లోని రిజండే ప్లాంట్‌లో ప్రారంభమైంది. 2026 నుంచి ఈ మోడల్‌ను 20కి పైగా దేశాలకు ఎగుమతి చేయనున్నారు. లాటిన్ అమెరికాతో పాటు ఇతర మార్కెట్లలో ఈ కారు హ్యుందాయ్ క్రెటాతో పాటు ఫోక్స్‌వ్యాగన్ టెరా వంటి మోడళ్లతో పోటీపడుతుంది.
ప్రస్తుతానికి నిస్సాన్ కైట్ భారత మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందనే దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అయితే నిస్సాన్ ఇండియా 2026 ప్రారంభంలో మూడవ తరం రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన కొత్త సి-సెగ్మెంట్ ఎస్‌యూవీని తీసుకురావాలని యోచిస్తోంది. ఈ కొత్త ఎస్‌యూవీకి కైట్, మాగ్నైట్ నుంచి డిజైన్ ప్రేరణ లభించే అవకాశం ఉంది.
నిస్సాన్ కైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పరిమాణం, ఫీచర్లలో ఆకట్టుకునేలా ఉంది. ఈ ఎస్‌యూవీ పొడవు 4.30 మీటర్లు, వెడల్పు 1.76 మీటర్లు, వీల్‌బేస్ 2.62 మీటర్లు ఉంటుంది. ఇందులో 432 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్, మెరుగైన ఇంటీరియర్, మంచి ఫీచర్ లెవెల్ ఉన్నాయి. ప్రపంచ మార్కెట్‌లో నిస్సాన్ కైట్ నాలుగు వేరియంట్లలో (Active, Sense Plus, Advance Plus, Exclusive) విడుదల కానుంది. ఇందులో ముఖ్యంగా 9 అంగుళాల టచ్‌స్క్రీన్ (వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో సహా), 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ ఏసీ, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ADAS వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
నిస్సాన్ కైట్ ఎస్‌యూవీ పర్ఫార్మెన్స్ పరంగా ఫ్లెక్స్-ఫ్యూయెల్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో 1.6-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజిన్ అమర్చారు. ఇది ఇథనాల్‌తో నడిస్తే 113 bhp పవర్, 149 Nm టార్క్; పెట్రోల్‌తో నడిస్తే 110 bhp పవర్, 146 Nm టార్క్ ఇస్తుంది. గియర్‌బాక్స్ కోసం ఇందులో CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది. నిస్సాన్ అంచనా ప్రకారం.. నగరంలో దీని మైలేజ్ లీటరుకు 11 కిలోమీటర్లు వరకు ఉంటుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

