Numeros Motors : ఇటాలియన్ డిజైన్‌తో n-First ఈ-స్కూటర్ లాంచ్.. కేవలం రూ.64,999 ప్రారంభ ధర.. 109 కి.మీ. రేంజ్.

Numeros Motors : ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ న్యూమెరోస్ మోటార్స్, భారతీయ టూ వీలర్ మార్కెట్లో తమ రెండవ ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. n-First పేరుతో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, ఇటాలియన్ డిజైన్ టచ్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటలీకి చెందిన ప్రముఖ డిజైన్ సంస్థ వీల్‌ల్యాబ్ సహకారంతో దీనిని రూపొందించారు. ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.64,999, అయితే ఈ ప్రత్యేక ధర మొదటి 1,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమైన ఈ స్కూటర్ ఫీచర్లు, రేంజ్, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.
న్యూమెరోస్ n-First ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇటాలియన్ డిజైన్ సంస్థ వీల్‌ల్యాబ్‌తో కలిసి అభివృద్ధి చేశారు. దీని ఫలితంగా ఈ స్కూటర్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. స్కూటర్ ముందు భాగంలో (ఫ్రంట్ ఏప్రాన్) రౌండ్ హెడ్‌లైట్ ఉంది. ఇది స్పెషల్ లుక్‌ను ఇస్తుంది. షార్ప్ లైన్లు, స్టైలిష్ హెడ్ యూనిట్‌తో స్పోర్టీ ఫీలింగ్‌ను అందిస్తుంది. వెనుక డిజైన్ కొంచెం సింపుల్‌గా, రెండు భాగాలుగా ఉన్న సీటుతో, స్ట్రెయిట్ లైన్లతో ఉంది.
ఈ స్కూటర్ సెగ్మెంట్‌లో అరుదుగా కనిపించే 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంది. ఇది ట్రాఫిక్ రెడ్, ప్యూర్ వైట్ అనే రెండు రంగుల ఆప్షన్లలో అందుబాటులో ఉంది. న్యూమెరోస్ n-First స్కూటర్ మూడు ట్రిమ్ లెవెల్స్‌లో మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి n-First Max, n-First i-Max, n-First Max+. ఇందులో చైన్ డ్రైవ్‌తో కూడిన 1.8 kW PMSM మిడ్-డ్రైవ్ మోటార్ ఉంది. ఇది స్మూత్ పిక్-అప్, మెరుగైన ఎనర్జీ ఎఫిషియెన్సీని అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 70 kmph వేగాన్ని చేరుకోగలదు. ఈ స్కూటర్‌లో లిక్విడ్ ఇమ్మర్షన్-కూల్డ్ Li-ion టెక్నాలజీతో కూడిన బ్యాటరీలను ఉపయోగించారు. ఇది బ్యాటరీ సేఫ్టీ, లైఫ్ టైం పెంచుతుంది.
ఈ స్కూటర్ ఛార్జింగ్ సమయం బ్యాటరీ కెపాసిటీ పై ఆధారపడి ఉంటుంది. 2.5 kWh బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 56 గంటలు పడుతుంది. అయితే 3.0 kWh బ్యాటరీకి సుమారు 78 గంటలు పట్టవచ్చు. ఇందులో ఓటీఏ అప్‌డేట్స్ సౌకర్యం కూడా ఉంది, దీని ద్వారా స్కూటర్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయవచ్చు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక భాగంలో హైడ్రాలిక్ డ్యాంపర్స్‌తో కూడిన అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ముందు, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లు అమర్చారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

