Ola Sales Drop : మూడో స్థానానికి ఓలా డౌన్

ఈవీ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఓలా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు దేశీయ మార్కెట్లో రారాజులా ఎంట్రీ ఇచ్చిన ఈ కంపెనీ ఇప్పుడు కష్టాలను, నష్టాలను చవిచూస్తోంది. మార్కెట్లో తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. ప్రస్తుతం మూడవ స్థానానికి పడిపోయింది. టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో రాణిస్తుండటంతో ఓలాకు ఈ పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వ వాహన పోర్టల్ డేటా ప్రకారం, మే 1-26 మధ్య 15,221 ఈవీ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోల్చితే (37,388 యూనిట్లు) ఇది 60 శాతం తక్కువ. దీంతో ఏప్రిల్లో 22.1 శాతంగా ఉన్న మార్కెట్ వాటా 20 శాతానికి తగ్గింది. ప్రస్తుతం భారతీయ ఈవీ ద్విచక్రవాహన మార్కెట్లో 25 శాతం వాటాతో టీవీఎస్ మోటార్ టాప్ ప్లేస్ దక్కించుకోగా, 22.6శాతంతో బజాజ్ ఆటో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఏథర్ ఎనర్జీ వాటా 13.1శాతంగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com