Ola Roadster : 8 ఏళ్ల వారంటీ, రూ.20,000 క్యాష్‌బ్యాక్.. ఓలా ఎలక్ట్రిక్ వాహనాలపై పండుగ సంబరం.

Ola Roadster : 8 ఏళ్ల వారంటీ, రూ.20,000 క్యాష్‌బ్యాక్.. ఓలా ఎలక్ట్రిక్ వాహనాలపై పండుగ సంబరం.
X

Ola Roadster : హోలీ పండుగ వేళ ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు ఓలా ఎలక్ట్రిక్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. తన పాపులర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రోడ్‌స్టర్ ధరను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హోలీ మహోత్సవ్ క్యాంపెయిన్‌లో భాగంగా ఇప్పుడు ఈ బైక్ ప్రారంభ ధరను కేవలం రూ.79,999 కు తగ్గించింది. పెట్రోల్ బైక్‌ల ధరలతో పోటీ పడుతూ, సామాన్యులకు సైతం ఎలక్ట్రిక్ బైక్‌ను చేరువ చేయడమే లక్ష్యంగా ఓలా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. తక్కువ ఖర్చుతో రోజూ ఆఫీసులకు, పనులకు వెళ్లే వారికి ఇది ఒక గొప్ప అవకాశమని చెప్పవచ్చు.

ఓలా రోడ్‌స్టర్ శ్రేణిలో కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లను అందుబాటులో ఉంచారు. ఓలా రోడ్‌స్టర్ X మోడల్ 3.5 kWh, 4.5 kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.92,999, రూ.99,999 గా ఉన్నాయి. ఇక మరింత పవర్‌ఫుల్ వెర్షన్ కావాలనుకునే వారి కోసం ఓలా రోడ్‌స్టర్ X+ అందుబాటులో ఉంది. ఇది 4.5 kWh, భారీ సామర్థ్యం గల 9.1 kWh బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. వీటి ధరలు రూ.1.10 లక్షల నుంచి రూ.1.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బైక్‌లు సుమారు 196 కిలోమీటర్ల నుంచి 201 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తాయని కంపెనీ వెల్లడించింది.

ఈ ఆఫర్లు కేవలం ధరల తగ్గింపుకే పరిమితం కాలేదు. ఓలా ముహూర్త మహోత్సవం పేరుతో ఒక పరిమిత కాల ఆఫర్‌ను కూడా ప్రవేశపెట్టింది. పండుగ రోజుల్లో కేవలం 90 నిమిషాల పాటు ఉండే శుభ ముహూర్తం సమయంలో బైక్ బుక్ చేసుకునే వారికి ప్రత్యేక ధరలకే వాహనాలు లభిస్తాయి. ఇప్పటికే ఓలా వాహనాలు వాడుతున్న ఓలా ఇన్‌సైడర్స్ కమ్యూనిటీ సభ్యులకు ఈ ముహూర్తంలో అదనంగా రూ.5,000 వరకు బెనిఫిట్స్ అందనున్నాయి. వీటితో పాటు కొన్ని ఎంపిక చేసిన ఎస్1 ప్రో స్కూటర్ మోడళ్లపై ఏకంగా 8 ఏళ్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.

పాత స్కూటర్లను మార్చుకుని కొత్త మోడల్స్ తీసుకోవాలనుకునే వారికి కూడా ఓలా బంపర్ ఆఫర్లు ప్రకటించింది. పాత స్కూటర్ ఎక్స్ఛేంజ్ ద్వారా కొత్త ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా రోడ్‌స్టర్ మోడల్స్‌పై గరిష్టంగా రూ.50,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే ఓలా పాత కస్టమర్లు తమ పేరు మీద మరో వాహనం కొనుగోలు చేస్తే రూ.20,000 వరకు అదనపు లబ్ధి చేకూరుతుంది. ఇందులో భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు కూడా ఉన్నాయి. పెట్రోల్ ధరలు మండుతున్న ఈ సమయంలో, ఓలా ఇస్తున్న ఈ పండుగ ఆఫర్లు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో కొత్త సంచలనం సృష్టించేలా ఉన్నాయి.

Tags

Next Story