Ola : సరికొత్త వివాదంలో ఓలా

Ola : సరికొత్త వివాదంలో ఓలా
X

విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా కొత్త వివాదంలో చిక్కుకుంది. ఓలా వెల్లడించిన వాహన విక్రయాల సంఖ్య, వాహన రిజిస్ట్రేషన్ల సంఖ్యకు సరిపోలడం లేదని కేంద్రం గుర్తించింది. దీనిపై దర్యాప్తు చేయాలని ARAIని ఆదేశించింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఫిబ్రవరిలో 25వేల వాహనాలు అమ్మినట్లు ఓలా పేర్కొనగా వాహన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 8,652గా ఉండటం గమనార్హం.

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వెల్లడించింన టూ- వీలర్ల విక్రయాల సంఖ్యకు, వాస్తవంగా అయ్యే కంపెనీ స్కూటర్లు, బైకుల వాహన రిజిస్ట్రేషన్లకు ఎలాంటి పొంతన ఉండడం లేదని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కంపెనీ చెబుతున్న సంఖ్య, రిజిస్ట్రేషన్లు అవుతున్న సంఖ్యలో చాలా తేడా ఉండడంతో పాటుగా వినియోగదారుల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులపై దర్యాప్తు చేయాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI)ని ఆదేశించింది. దర్యాప్తునకు సంబంధించిన నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags

Next Story