OLA : ఎలక్ట్రిక్ బైక్ ల అమ్మకాల్లో ఓలా టాప్

OLA : ఎలక్ట్రిక్ బైక్ ల అమ్మకాల్లో ఓలా టాప్
X

ఎలక్ట్రిక్ బైక్ ల అమ్మకాల్లో సెప్టెంబర్ నెలలోనూ ఓలా టాప్ లో నిలిచింది. ఈవీ బైక్ ల రంగంలో ప్రముఖ కంపెనీల మధ్య పోటీ క్రమంగా పెరుగుతోంది. ఈవీల అమ్మకాల్లో క్రమంగా తమ మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా టీవీఎస్‌, బజాజ్‌ మధ్య ఈ విషయంలో గట్టి పోటీ నెలకొంది. ఓలా తర్వాత టీవీఎస్‌ రెండో స్థానంలో ఉండగా.. సెప్టెంబర్‌లో బజాజ్‌ చేతక్‌ ఆ స్థానాన్ని ఆక్రమించింది. సెప్టెంబర్‌ నెలకు సంబంధించి వాహన అమ్మకాల్లో ఓలా 23,965 యూనిట్ల సేల్స్ తో అగ్రస్థానంలో నిలిచింది. ఒకప్పడు నెలకు సగటున 30 వేల వాహనాలు అమ్మే ఈ సంస్థ.. మార్కెట్‌ వాటా తాజాగా 27 శాతానికి పడిపోయింది. అదే సమయంలో బజాజ్‌ ఆటో తన అమ్మకాలను పెంచుకుంటోంది. 18,933 చేతక్‌లను అమ్మి రెండో స్థానంలో నిలిచింది. టీవీఎస్‌ సైతం 17,865 యూనిట్ల ఐక్యూబ్‌లను సేల్ చేసింది. ఈవీ స్టార్టప్‌ ఏథర్‌, హీరో మోటోకార్ప్‌ బ్రాండ్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లతో స్కూటర్లను అందిస్తూ కొన్నేళ్లుగా ఓలా ఎలక్ట్రిక్‌ మార్కెట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సెప్టెంబర్‌ నెలలోనూ ఆ స్థానం పదిలంగానే ఉన్నా.. బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ నుంచి ఎదురవుతున్న పోటీకి మాత్రం కంపెనీ మార్కెట్‌ వాటా క్రమంగా కోసుకుపోతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఓలాకు పోటీగా ఈ రెండు కంపెనీలూ చేతక్‌, ఐక్యూబ్‌ మోడళ్లను మరింత అందుబాటు ధరలో తీసుకొచ్చాయి. ఓలా సర్వీసు సెంటర్ల విషయంలో కస్టమర్లు అసంతృప్తి రెండో కారణం. అదేసమయంలో బజాజ్‌, టీవీఎస్‌కు ఇప్పటికే విస్తృతమైన నెట్‌వర్క్‌ ఉన్నాయి. విడా పేరుతో హీరో మోటోకార్ప్‌ సైతం ఈవీ రేసులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. కాస్త ఆలస్యం కావడంతో ఆ స్థాయి డిమాండ్‌ను అందుకోలేకపోతోంది. స్థిరంగా 4 వేల యూనిట్ల అమ్మకాలను మాత్రం నమోదు చేస్తోంది.

Tags

Next Story