MG Cyberster : ఎంజీ సైబర్‌స్టర్ సంచలనం..6 నెలల్లోనే 500 కార్లతో ఇండియాలో నంబర్-1 స్పోర్ట్స్ కారుగా రికార్డు.

MG Cyberster : ఎంజీ సైబర్‌స్టర్ సంచలనం..6 నెలల్లోనే 500 కార్లతో ఇండియాలో నంబర్-1 స్పోర్ట్స్ కారుగా రికార్డు.
X

MG Cyberster : భారతదేశంలో స్పోర్ట్స్ కార్లంటే కేవలం పెట్రోల్ ఇంజిన్లే కాదు, ఎలక్ట్రిక్ కార్లు కూడా దుమ్ము రేపగలవని ఎంజీ సైబర్‌స్టర్ నిరూపించింది. రూ.74.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్) ధర కలిగిన ఈ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్, 2025లో భారత మార్కెట్లోకి వచ్చిన ఆరు నెలల్లోనే 500 యూనిట్ల మార్కును దాటేసింది. ఎంజీ మోటార్ ఇండియాకు చెందిన ప్రీమియం విభాగం ఎంజీ సెలెక్ట్ ద్వారా ఈ కారును విక్రయిస్తున్నారు. సైబర్‌స్టర్‌తో పాటు ఎంజీ9 లగ్జరీ సెడాన్ కూడా తన సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఈ కారు పనితీరు గురించి చెప్పుకుంటే.. ఇందులో 77 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 580 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చే ఈ కారు 510 PS శక్తిని, 725 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని అసలైన పవర్ ఏంటంటే.. కేవలం 3.2 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. లాంచ్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ వంటి ఫీచర్లు దీనిని ఒక పక్కా రేసింగ్ కారులా మారుస్తాయి.

డిజైన్ పరంగా చూస్తే, ఇది రెండు డోర్లు కలిగిన కన్వర్టిబుల్ కారు. బటన్ నొక్కితే చాలు, వెదర్ ప్రూఫ్ సాఫ్ట్-టాప్ రూఫ్ పది సెకన్లలోనే ఫోల్డ్ అయిపోతుంది. కారు లోపల మల్టీ-స్క్రీన్ కాక్ పిట్ సెటప్ ఉంది. డ్రైవర్ ముందు 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, దాని పక్కన మరో రెండు టచ్ స్క్రీన్లు ఉంటాయి. బోస్ ఆడియో సిస్టమ్, విలాసవంతమైన వెగన్ లెదర్ సీట్లు ఈ కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. ఎంజీ సైబర్‌స్టర్ ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది, అందులో ఇటీవల వచ్చిన ఐరిసెస్ సియాన్ కలర్ మరింత ఆకర్షణీయంగా ఉంది.

కేవలం వేగమే కాదు, సేఫ్టీకి కూడా ఎంజీ పెద్ద పీట వేసింది. లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా, నాలుగు ఎయిర్ బ్యాగ్‌లతో ఈ కారు అత్యంత సురక్షితమైనదిగా పేరు తెచ్చుకుంది. ఖరీదైన ధర ఉన్నప్పటికీ, ఇండియన్ కస్టమర్లు తమకు నచ్చిన లగ్జరీ, పర్ఫార్మెన్స్ కోసం ఈ కారును ఎంచుకుంటున్నారని కంపెనీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story