Pakistan Airlines : అప్పుల కుప్పలో పాక్ ఎయిర్‌లైన్స్..ఎయిర్ హోస్టెస్ జీతం మాత్రం లక్షల్లోనే..ఇదెక్కడి లెక్క సామీ?

Pakistan Airlines : అప్పుల కుప్పలో పాక్ ఎయిర్‌లైన్స్..ఎయిర్ హోస్టెస్ జీతం మాత్రం లక్షల్లోనే..ఇదెక్కడి లెక్క సామీ?
X

Pakistan Airlines : పాకిస్థాన్ జాతీయ విమానయాన సంస్థ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు అమ్ముడుపోయింది. అప్పుల్లో కూరుకుపోయి, నష్టాల్లో నడుస్తున్న ఈ సంస్థను ఆరిఫ్ హబీబ్ కన్సార్టియం దక్కించుకుంది. ఈ డీల్ విలువ అక్షరాలా 135 బిలియన్ పాకిస్థానీ రూపాయలు (భారత కరెన్సీలో సుమారు రూ.4,317 కోట్లు). అయితే ఇంత భారీ నష్టాల్లో ఉండి, అమ్ముడుపోయే స్థితికి చేరిన ఈ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఎయిర్ హోస్టెస్ జీతాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా, PIAలో పనిచేసే ఎయిర్ హోస్టెస్ జీతాలు మాత్రం ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. కొత్తగా చేరిన ఎయిర్ హోస్టెస్‌కు నెలకు 80,000 నుంచి 1,20,000 పాకిస్థానీ రూపాయల వరకు జీతం లభిస్తుంది. అయితే కేవలం బేసిక్ శాలరీ మాత్రమే కాకుండా.. వీరికి అందే అదనపు భత్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అనుభవం ఉన్న సీనియర్ సిబ్బందికి హౌసింగ్, మెడికల్, ఇన్సూరెన్స్, విదేశీ ప్రయాణాల భత్యాలన్నీ కలిపితే నెల జీతం ఏకంగా 5,00,000 పాకిస్థానీ రూపాయల వరకు చేరుతుంది. సగటున చూసినా ఒక క్యాబిన్ క్రూ సభ్యురాలు నెలకు రూ. 2.85 లక్షలు సంపాదిస్తున్నారు.

సాధారణంగా ప్రభుత్వ సంస్థల కంటే ప్రైవేట్ రంగంలో జీతాలు ఎక్కువ ఉంటాయని మనం అనుకుంటాం. కానీ పాకిస్థాన్ ఏవియేషన్ రంగంలో మాత్రం సీన్ రివర్స్. PIAలో సీనియర్ స్టాఫ్ సంపాదన ప్రైవేట్ కంపెనీల కంటే చాలా మెరుగ్గా ఉంది. పాకిస్థాన్‌కు చెందిన ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సెరీన్ ఎయిర్ తన సిబ్బందికి రూ.70,000 నుండి రూ.లక్ష వరకు ఇస్తుండగా, ఎయిర్ బ్లూ రూ.65,000 నుంచి రూ.95,000 వరకు మాత్రమే ఆఫర్ చేస్తోంది. అంటే PIA ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, తన సిబ్బందికి మాత్రం ప్రైవేట్ సంస్థల కంటే ఎక్కువ జీతాలే చెల్లిస్తోంది.

పాకిస్థాన్ ప్రభుత్వం PIAలో ఉన్న 75 శాతం వాటాలను వేలం వేయగా, వచ్చిన రూ.135 బిలియన్ల మొత్తంలో సుమారు 92.5 శాతాన్ని సంస్థను గాడిలో పెట్టడానికే ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం PIA వద్ద ఎయిర్‌బస్ A320, బోయింగ్ 777 వంటి 32 పవర్ఫుల్ విమానాలు ఉన్నాయి. కొత్త యాజమాన్యం చేతిలోకి వెళ్లిన తర్వాత, విమానాల మెయింటెనెన్స్, సర్వీసులు మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఈ మార్పు వల్ల సిబ్బంది జీతభత్యాల్లో ఏవైనా మార్పులు వస్తాయా లేదా అనేది వేచి చూడాలి.

Tags

Next Story