Petrol and diesel prices : లీటర్‌ పై రూ. 12 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!

Petrol and diesel prices : లీటర్‌ పై రూ. 12  పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!
Petrol and diesel prices : ఉత్తరప్రదేశ్ తో పాటుగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా గత నాలుగు నెలలుగా ఫ్రీజ్‌లో ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు మళ్ళీ పెరగనున్నాయి.

Petrol and diesel prices : ఉత్తరప్రదేశ్ తో పాటుగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా గత నాలుగు నెలలుగా ఫ్రీజ్‌లో ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు మళ్ళీ పెరగనున్నాయి. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో మళ్ళీ పెట్రోలు, డీజిల్ ధరలను పెంచే ఆలోచనలో చమరు సంస్థలున్నాయి. లీటర్ కి రూ. 12 వరకు పెంచే అవకాశం ఉంది. అయితే ఈ పెంపు దశలవారీగా ఉండాలని చమురు సంస్థలకు ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు తరవాత ధరల పెంపు పైన ఓ క్లారిటీ రానుంది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 111 డాలర్లకు చేరింది. మరో నెలలో ఇది 140 డాలర్లకూ చేరొచ్చన్నది అంచనా. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలను సవరించే వీలున్నప్పటికీ చమురు సంస్థలు ఆ పనిచేయలేదు. యూపీలో మార్చి 7న చివరి చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు రానున్నాయి.

అయితే పెరిగిన చమురు ధరల కారణంగా చమురు సంస్థలు ఇప్పటికే నష్టాలను ఎదుర్కొంటున్నాయి. తమ మార్జిన్లు కోల్పోకుండాఉండాలంటే పెట్రోల్‌, డీజిల్‌పై మార్చి 16వ తేదీలోపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కనీసం 12 రూపాయల మేర పెంచాల్సి ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇక ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹95.41 డీజిల్ ధర ₹86.67‌గా ఉంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రేటును తగ్గించిన తర్వాత ఈ ధర అమలులో ఉంది

Tags

Read MoreRead Less
Next Story