Petrol And Diesel Rates: పెట్రోల్ ధరలు బాదుడు.. మిగతా రాష్ట్రాలకంటే ఏపీలో..

Petrol And Diesel Rates: పెట్రోల్ ధరలు మరింత భగ్గుమంటున్నాయి. రోజువారీ వాతలతో అంతకంతకూ ధర పైపైకి వెళ్తున్న తీరు చూసి సామాన్యులైతే తీవ్రమైన కోపంతో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుతో వాతలు పెట్టడం పట్ల అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కరోనా తర్వాత నెమ్మదిగా జనజీవనం సాధారణ స్థితికి చేరుతుందని సంతోషించేలోపు ఇలా ట్యాక్సుల పేరుతో అడ్డగోలుగా దోపిడీకి దిగితే ఎలాగంటున్నారు.
ముఖ్యంగా పేద, మధ్య తరగతివారు బైక్, కార్ తీయాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చేశాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడల్లాంటిచోట లీటరు పెట్రోల్ తాజాగా 36 పైసలు పెరిగి 114 రూపాయలకు చేరువలో ఉంది. ఈ ఒక్క ఏడాదిలోనే చమురు ధర ఏకంగా 27 రూపాయల వరకూ పెరిగిందంటే బాదుడు ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఈ బాదుడు ఇంకో రెండు రూపాయలు ఎక్కువగా ఉండడం కూడా వినియోగదారుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 111 రూపాయల 87 పైసలు ఉంటే, గుంటూరు, విజయవాడల్లో 113 రూపాయల 57 పైసలు ఉంది. వైజాగ్‌లోనూ పెద్ద తేడా లేదు. ఈ స్థాయిలో చమురు సంస్థలు రేట్లు పెంచేస్తుండడంతో జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com