Petrol and DIesel Rates : దేశవ్యాప్తంగా వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol and DIesel Rates : దేశవ్యాప్తంగా వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol and DIesel Rates : దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.

Petrol and DIesel Rates : దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం, అంతర్జాతీయ పరిణామాలు అంటూ సామాన్యులను దోచేస్తున్నాయి ప్రభుత్వాలు. అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్‌ ఇప్పటికే వంద రూపాయలు దాటగా.....ఏపీలో 112 రూపాయలు, తెలంగాణలో 110 రూపాయలుగా ఉంది. అటు డీజిల్ ధర సైతం వందకు చేరువవుతోంది. పెట్రోల్‌,డీజిల్‌పై అధికంగా పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్రతో పాటు ఏపీ, తెలంగాణ వరుస స్థానాల్లో ఉన్నాయి. పెరిగిన ధరలతో బండి బయటకు తీయాలంటేనే సామాన్యుడు భయపడాల్సిన పరిస్థితి. పెట్రోల్‌, డీజిల్ ధరల పెరుగుదలతో దాని వెనకాలే నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు జీవనం రోజు రోజు భారంగా మారుతోంది. ఓ చేత్తో ఉచితాలు ఇస్తూ...మరో చేత్తో వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ బేసిక్ ధరతో పోల్చితే వసూలు చేసే ట్యాక్సులే అధికంగా ఉన్నాయి. ఐతే పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి. రాష్ట్రాలే అధికంగా ట్యాక్సు వసూలు చేస్తున్నాయని కేంద్రం ఆరోపిస్తుంటే...ధరల నియంత్రమ కేంద్రం చేతుల్లోనే ఉందంటూ రాష్ట్రాలు ప్రతి విమర్శ చేస్తున్నాయి. పెట్రోల్‌,డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. జీఎస్టీకి బయట ఉండడంతోనే ధరలు పెరుగుతున్నాయన్న వాదన ఉంది. ఐతే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాలు అంగీకరించడం లేదని కేంద్రం చెబుతోంది.

పెట్రోల్‌,డీజిల్ ధరల పెంపుతో మరోసారి వ్యాట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి సంబందించి కేంద్రం తాజాగా వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాలు సెంట్రల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ కన్నా....ఎక్కువగా ట్యాక్స్ వసూలు చేస్తున్నాయని వివరించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.

దాదాపు ఏడు రాష్ట్రాలు ప్రస్తుతమున్నఇంధన ధరలో సగం వినియోగదారుని దగ్గర నుంచి ట్యాక్సు రూపంలో వసూలు చేస్తున్నాయని తెలిపింది. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, బిహార్ ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 52 రూపాయల 50 పైసలు ట్యాక్స్‌గా వసూలు చేస్తుండగా...ఆంధ్రప్రదేశ్‌లో 52 రూపాయల 40 పైసలు, తెలంగాణలో 51 రూపాయల 60 పైసలు ట్యాక్సు రూపంలో వసూలు చేస్తున్నారు. రాజస్థాన్‌లో 50 రూపాయల 80 పైసలు, మధ్యప్రదేశ్‌లో 50 రూపాయల 60 పైసలు, కేరళలో 50 రూపాయల 20 పైసలు, బిహార్‌లో 50 రూపాయలు ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు.

కొన్ని నెలలకు ముందు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 10 రూపాయలు, డీజిల్‌పై 5 రూపాయల చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి పలు రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి. దీంతో వినియోగదారులకు స్వల్ప ఊరట కల్పించినట్లయింది. ఐతే తెలుగు రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ తగ్గించలేదు. పెట్రోల్,డీజిల్‌పై భారీగా పన్నులు వసూలు చేయడంపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది

Tags

Read MoreRead Less
Next Story