Post Office : పోస్టాఫీస్ అదిరిపోయే స్కీం.. నెలకు రూ.50 వేలు పొదుపు చేస్తే 5 ఏళ్లలో రూ.35 లక్షలు.

Post Office : మీ డబ్బును ఎలాంటి పెద్ద రిస్క్ లేకుండా సురక్షితంగా పెంచుకోవాలని చూస్తున్నారా.. ప్రతి నెలా కొద్ది మొత్తంలో పొదుపు చేస్తూ, కేవలం 5 ఏళ్లలో పెద్ద మొత్తంలో లాభం పొందాలని చూస్తున్నారా? అయితే, పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకం మీకు చాలా బాగా సరిపోతుంది. ఈ స్కీమ్‌లో ప్రతి నెల చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి కూడా, 5 ఏళ్లలో లక్షల్లో లాభం పొందవచ్చు.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తం అవసరం లేదు. ఈ పథకంలో మీరు కేవలం రూ.100ల చిన్న మొత్తంతో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. దీనికి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. ప్రతి నెల మీరు నిర్ణయించుకున్న ఒక చిన్న వాయిదా మొత్తాన్ని క్రమం తప్పకుండా జమ చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. సామాన్య ప్రజలకు, తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన పొదుపు మార్గం.
ఈ పథకంలో మీరు మంచి రాబడిని సులభంగా పొందవచ్చు. ఉదాహరణకు, మీరు ప్రతి నెలా పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీలో రూ.50,000లు పెట్టుబడి పెట్టినట్లయితే, ఐదు సంవత్సరాలలో మీరు జమ చేసే మొత్తం రూ.30 లక్షలు అవుతుంది. దీనికి అదనంగా ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం మొత్తం రాబడి రూ.35 లక్షల వరకు చేరుకోవచ్చు. అంటే, సుమారు రూ.5 లక్షల వరకు అదనపు లాభం ఈ పథకం ద్వారా పొందవచ్చు.
పోస్టాఫీస్ ఆర్‌డీ పథకం పూర్తిగా సురక్షితమైనది. ఎందుకంటే దీనికి భారత ప్రభుత్వ మద్దతు ఉంటుంది. షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో మాదిరిగా ఇందులో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు. మీరు పెట్టిన పెట్టుబడికి వడ్డీ రేటు కూడా స్థిరంగా ఉంటుంది. దీనివల్ల మీ డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు, మీరు ఆశించిన రాబడి ఖచ్చితంగా అందుతుంది.
అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే, ఈ ఆర్‌డీ పథకంలో ఒక మంచి సదుపాయం ఉంది. మీరు డిపాజిట్ ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత, మీరు జమ చేసిన మొత్తంలో 50% వరకు లోన్ తీసుకోవచ్చు. దీనివల్ల అకౌంట్‌ను క్లోజ్ చేయకుండానే డబ్బును వాడుకోవచ్చు. తర్వాత తీర్చవచ్చు. అంతేకాకుండా, ఈ పథకంలో మీరు సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. అంటే, మీ పెట్టుబడికి భద్రత, మంచి రాబడితో పాటు పన్ను ఆదా కూడా లభిస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com