PPF Account: ఈ రూల్స్ పాటిస్తే పీపీఎఫ్ అకౌంట్‌పై లోన్ తీసుకోవచ్చట!

PPF Account: చిన్నతనంలో డబ్బులను దాచిపెట్టుకోవడానికి మనీ బ్యాంక్స్ వాడేవాళ్లం. పెద్దయ్యాక లాకర్‌లో డబ్బులు దాచుకోవాలనే ధ్యాస వచ్చింది. మరింత పెద్దయ్యి ఉద్యోగాల్లో చేరిన తర్వాత డబ్బులను సేవ్ చేసుకోవడానికి బ్యాంకుల సాయం తీసుకుంటున్నాం. ముఖ్యంగా మనీ సేవింగ్‌కు అందరికీ ఉపయోగపడుతున్న స్కీమ్ పీపీఎఫ్ (PPF) అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఏ రిస్క్ లేకుండా రాబడి సొంతం చేసుకోవచ్చన్న ఉద్దేశ్యంతో అందరూ ఈ పీపీఎఫ్‌ను మనీ సేవింగ్ టూల్‌గా ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు సేఫ్‌గా డబ్బులు దాచుకోవడానికి మాత్రమే ఉపయోగపడే పీపీఎఫ్‌తో ఇప్పుడు మరో సదుపాయాన్ని అందించనున్నాయి బ్యాంకులు.
ప్రస్తుత రోజుల్లో మన దగ్గర ఉన్న ప్రతీ వస్తువుపై లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్‌ను తిరిగి కట్టగలమన్న మినిమమ్ గ్యారెంటీ ఉంటే బ్యాంకులు కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా లోన్స్ ఇవ్వడానికి సిద్ధమయిపోతున్నాయి. అలాగే పీపీఎఫ్ అకౌంట్‌పై కూడా లోన్ తీసుకునే సదుపాయం ఉంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. కానీ అలా లోన్ తీసుకోవడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ పాటిస్తే పీపీఎఫ్‌పై లోన్‌ను పొందడం చాలా ఈజీ.
పీపీఎఫ్ ఖాతా తెరిచిన దగ్గరి నుంచి 3-6 ఏళ్ల మధ్య కాలంలో లోన్ తీసుకోవచ్చు. ఇవి షార్ట్ టర్మ్ లోన్స్. అంటే తీసుకున్న రుణాన్ని 36 నెలల లోగా మళ్లీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు 1 శాతంగా ఉంటుంది. 36 నెలలలోపు తిరిగి కట్టేస్తే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. లేదంటే 6 శాతం వడ్డీ పడుతుంది. పీపీఎఫ్ ఖాతాలో జమ అయిన డబ్బుల్లో 25 శాతం వరకు మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు. లోన్ కోసం అప్లై చేసుకోవాలని భావించే వారు ఫామ్ డి ఫిల్ చేసి ఇవ్వాలి. పోస్టాఫీస్ లేదా బ్యాంక్ మీరు ఎక్కడ పీపీఎఫ్ ఖాతా తెరిచారో అక్కడ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com