Rapido : ఫుడ్ డెలివరీ విభాగంలోకి ర్యాపిడో ఎంట్రీ!

Rapido : ఫుడ్ డెలివరీ విభాగంలోకి ర్యాపిడో ఎంట్రీ!
X

ఫుడ్ డెలివరీ విభాగంలో పోటీ పెరుగుతోంది. వినియోగదారుల నుంచి ఫుడ్ డెలివరీకి ఆదరణ పెరుగుతోంది. నిముషాల వ్యవధిలోనే నచ్చిన ఆహారాన్ని ఇంటికే తీసుకు వస్తుండడంతో ఫుడ్ డెలివరీ సంస్థలకు ఆదరణ వస్తోంది. ప్రస్తుతం ఈ విభాగంలో స్విగ్గీ, జొమాటో పని చేస్తున్నాయి. తాజాగా క్యాబ్, బైక్ బుకింగ్ సేవల సంస్థ ర్యాపిడో కూడా ఫుడు డెలివరీ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ విభాగంలో స్విగ్గీ, జొమాటో రెండు సంస్థలే ఆదిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ విభాగంలో పోటీ ఇచ్చేందుకు ర్యాపిడో ప్రయత్నిస్తోంది. భారీ స్థాయిలో ఇందులో ప్రవేశించేందుకు ర్యాపిడో ప్రతినిధు లు పలు రెస్టారెంట్లతో చర్చలు జరుపుతున్నారు. సరికొత్త వ్యాపార విధానాలతో ముందుకు రావాలని ర్యాపిడో ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ర్యాపిడో 2015లో క్యాబ్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. అతి తక్కువ సమయంలోనే రైడ్ షేరింగ్లో ర్యాపిడో రెండో స్థానంలో నిలిచింది. సంస్థ ఇప్పటికే తన ద్విచక్రవాహన సేవలను ఉపయోగించి వ్యక్తిగత రెస్టారెంట్లకు డెలివరీ సేవలను అందిస్తోంది. ర్యాపిడో 100 నగరాల్లో సేవలను అందిస్తోంది. 2025 నాటికి దేశవ్యాప్తంగా 500 నగ రాలకు సేవలను విస్తరించాలని సంస్థ భావిస్తోంది.

Tags

Next Story