RBI : డిజిటల్‌ పేమెంట్స్‌లో మార్పులు.. బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం

RBI : డిజిటల్‌ పేమెంట్స్‌లో మార్పులు.. బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం
X

వైకల్యంతో బాధపడే కస్టమర్లు సులభంగా సేవలు పొందే విధంగా బ్యాంక్‌లు తమ చెల్లింపుల వ్యవస్థలను సమీక్షించుకోవాలని ఆర్‌బీఐ ఆదేశించింది. సమాజంలోని అన్ని వర్గాలు, దివ్యాంగులు సైతం డిజిటల్‌ చెల్లింపులను అనుసరిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ‘మరింత మెరుగైన సేవలను పొందేందుకు వీలుగా చెల్లింపుల వ్యవస్థల భాగస్వాములు (పీఎస్‌పీలు/బ్యాంక్‌లు/నాన్‌ బ్యాంక్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్లు) తమ చెల్లింపుల వ్యవస్థలు/పరికరాలను సమీక్షించాలి. దివ్యాంగులు సైతం సులభంగా వినియోగించుకునే విధంగా ఉండాలి. సమీక్ష అనంతరం దివ్యాంగులు సైతం వినియోగించుకునేందుకు వీలుగా.. బ్యాంక్‌లు, నాన్‌ బ్యాంక్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్లు తమ వ్యవస్థల్లో, పీవోఎస్‌ మెషిన్లలో అవసరమైన మార్పులు చేయాలి’అని ఆర్‌బీఐ తన సర్క్యులర్‌లో పేర్కొంది.

Tags

Next Story