RBI : ఆర్బీఐ కొత్త మార్గనిర్దేశకాలు.. కేవైసీ మోసాలకు చెక్

RBI : ఆర్బీఐ కొత్త మార్గనిర్దేశకాలు.. కేవైసీ మోసాలకు చెక్

కేవైసీ మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ డబ్బు దోచుకోవడమే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాళ్ళు. పెరిగిపోతున్న బ్యాంకింగ్ మోసాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రత్యేకంగా దృష్టిపెట్టి కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది

ముఖ్యంగా బ్యాంకు అకౌంట్ హోల్డర్లను అలర్ట్ చేస్తూ పలు సూచనలు చేసింది ఆర్బీఐ. సైబర్ నేరస్థుల బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలి.. ఏం చేయకూడదంటూ గైడ్ లైన్స్ విడుదల చేసింది. అవసరమైన గుర్తింపు పత్రాలతో బ్యాంకులోనే కేవైసీ అప్ డేట్ చేసుకోవడం ఉత్తమమని చెబుతోంది. ఎల్లప్పుడూ మీ బ్యాంకు అధికారిక వెబ్ సైట్, యాప్ లలోనే లాగిన్ కావాలని సూచించింది. కస్టమర్ కేర్ ప్రతినిధులతో మాట్లాడేందుకు గూగుల్ లో కనిపించిన నెంబర్లకు కాకుండా బ్యాంకు అధికారిక వెబ్ సైట్ లోని నెంబర్లను కాంటాక్ట్ కావాలని చెప్పింది. మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి.. ఆన్ లైన్ మోసానికి గురైతే వెంటనే మీ బ్యాంకుకు సమాచారం ఇవ్వాలని ఆర్బీఐ సూచిస్తోంది.

బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పినా, నిజంగా బ్యాంకు సిబ్బందే ఫోన్ చేసినా సరే లాగిన్ వివరాలు చెప్పొద్దని తెలిపింది. ఆధార్ కార్డు, చిరునామా, ఇతరత్రా గుర్తింపు పత్రాలను ఎక్కడపడితే అక్కడ ఇచ్చారంటే వాటిని సైబర్ నేరాలకు ఉపయోగించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎస్ఎంఎస్ లలో వచ్చే అనధికార లింకులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని మరీ మరీ హెచ్చరించింది ఆర్బీఐ.

Tags

Read MoreRead Less
Next Story