2 వారాల్లో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశం

X
By - kasi |3 Oct 2020 8:54 AM IST
ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశం వచ్చే ఒకటి నుంచి 2 వారాల్లో జరగనున్నట్టు తెలుస్తోంది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ ఇండిపెండెంట్ సభ్యుల్లో ముగ్గురి పదవీకాలం గత నెల్లో ముగిసింది. వీళ్ళ స్థానంలో ప్రభుత్వం ఇంకా ఎవరినీ నియమించకపోవడంతో ఈ వారం జరగాల్సిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం వాయిదా పడింది. ఎంపీసీ సమావేశ నిర్వహణకు కనీసం నలుగురు సభ్యులు అవసరమని, కొత్త సభ్యుల నియామకం పూర్తయ్యే వరకు ఆర్‌బీఐ ఎంపీసీ జరగడానికి వీల్లేదని తాజా నిబంధనలు చెబుతున్నాయి. ఇక ఎంపీసీలో కొత్త స్వతంత్ర సభ్యులను ఎంపిక చేసేందుకు మంత్రిమండలి కార్యదర్శి నేతృత్వంలో ఆర్‌బీఐ గవర్నరు, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సభ్యులుగా ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com