Reliance : చరిత్ర సృష్టించిన రిలయన్స్ ... తొలి కంపెనీగా రికార్డు

Reliance : చరిత్ర సృష్టించిన రిలయన్స్ ... తొలి కంపెనీగా రికార్డు

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డు సృష్టించింది. 20 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను దాటింది. ఈ రికార్డును సొంతం చేసుకున్న తొలి దేశీయ కంపెనీగా రికార్డు సృష్టించింది. టీసీఎస్ స్టాక్ రూ. 15 లక్షల కోట్లతో రెండో స్థానంలో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 10.5 లక్షల కోట్లతో మూడో స్థానంలో, ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 7 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో, ఇన్ఫోసిస్ రూ. 7 లక్షల కోట్లతో ఐదో స్థానంలో ఉన్నాయి. రిలయన్స్ కు మిగతా కంపెనీలకు వ్యత్యాసం భారీగా ఉండటం గమనార్హం. ఇప్పట్లో మరేఇతర స్టాక్ దీన్ని అధిగమించే సూచనలు కన్పించడం లేదు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు సోమవారం రూ.2,904 వద్ద ముగిసింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 11.16 గంటలకు 1.8 శాతం మేర లాభంతో రూ.2,953 వద్ద ట్రేడయ్యింది. ఈ క్రమంలోనే కంపెనీ మార్కెట్‌ విలువ రూ.20 లక్షల కోట్లు దాటింది. మధ్యాహ్నం ఒంటి సమయంలో 1.26 శాతం లాభంతో రూ.2941 వద్ద స్టాక్‌ ట్రేడవుతోంది.

2005లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదటి సారి రూ.1 లక్ష కోట్ల మార్కెట్ విలువను చేరుకుంది. ఆ తరువాత 2007లో రూ.2 లక్షల కోట్లు, 2007లో రూ.3 లక్షల కోట్లు, 2007లో రూ.4 లక్షల కోట్లకు చేరింది. 2017లో రూ.5 లక్షల కోట్లు, 2019లో రూ.10 లక్షల కోట్లు, 2021లో రూ.15 లక్షల కోట్లు చేరింది. ఆ తరువాత సుమారు 600 రోజుల్లో రూ.20 లక్షల కోట్లు మైలురాయిని సాధించింది. అంటే 2005 నుంచి రూ. 20 లక్షల కోట్ల విలువను చేరుకోవడానికి దాదాపు 19 సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story