Reliance Jio Bumper Offer : రిలయన్స్ జియో బంపర్ ఆఫర్

రిలయన్స్ జియో తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తాజాగా రెండు నూతన ప్లాన్ ల రీఛార్జ్ అవకాశాన్ని కల్పిస్తోంది. అది కూడా ఏకంగా 12ఓటీటీలను చూసే అవకాశం కల్పించింది. 28 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న రెండు ప్లాన్ లలో రిలయన్స్ జియో సబ్ స్కెబర్లకు జియోటీవీ ప్రీమియం ప్లాన్లు రూ.500 కంటే తక్కువ ధరకే అందించబడుతున్నాయి. మొదటి ప్లాన్ ధర రూ. 175తో రీఛార్జ్ చేస్తే, మీరు 28 రోజుల చెల్లుబాటుతో అదనపు డేటాను పొందుతారు. ఈ ప్లాన్ 10జీబీ అదనపు డేటాతో ఓటీటీ ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే దీనితో రీఛార్జ్ చేస్తే, కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. కేవలం ఈ ప్లాన్ ఓటీటీ సేవలకు యాక్సెస్ ఇస్తోంది. కచ్చితంగా డజను ఓటీటీలతో పాటు రోజువారీ డేటా కావాలంటే, రూ.448 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో 28 రోజుల చెల్లుబాటుతో 2జీబీ రోజువారీ డేటా లభిస్తుంది. ఇది కాకుండా, అన్ని నెట్వర్క్ లలో అపరిమిత కాలింగ్ చేయవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు పంపే అవకాశం ఉంది. ఇందులో మునుపటి ప్లాన్ తో పోలిస్తే మరో రెండు ఓటీటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 12 ఓటీటీలకు యాక్సెస్ ఇవ్వబడుతోంది. సోనీ లైవ్, జీ5, జీయో సినిమా ప్రీమియం, సన్ నెక్స్టు, డిస్కవరీ ప్లస్ సహా మొత్తం12 ఓటీటీ సేవలు లభిస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com