New SUV : మారుతికి పెరగనున్న టెన్షన్.. మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెక్టన్.

New SUV : భారతీయ మార్కెట్‌లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ప్రస్తుతం అత్యంత పోటీతత్వంతో కూడినదిగా మారింది. ఇందులో దాదాపు 13 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. టాటా మోటార్స్ ఇటీవల సియెరాను, మారుతి సుజుకి విక్టోరిస్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ పోటీ మరింత పెరిగింది. ఇప్పుడు, రెనాల్ట్, నిస్సాన్ కూడా ఈ విభాగాన్ని టార్గెట్ చేస్తూ 2026 లో రెండు కొత్త, పవర్ఫుల్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ రెండు కొత్త ఎస్‌యూవీల రాకతో, మార్కెట్లో ఇప్పటికే బలమైన స్థానంలో ఉన్న మారుతి సుజుకి వంటి కంపెనీలకు మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్
రెనాల్ట్ తన అత్యంత ప్రజాదరణ పొందిన డస్టర్ మోడల్‌ను థర్డ్ జనరేషన్లో భారతీయ మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. రెనాల్ట్ ఇప్పటికే కొత్త తరం డస్టర్ జనవరి 26, 2026 న భారతీయ మార్కెట్‌లో ప్రవేశిస్తుందని ధృవీకరించింది. ఈ కొత్త ఎస్‌యూవీ CMF-B ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. దీని పొడవు సుమారు 4,360 మి.మీ., వీల్‌బేస్ 2,673 మి.మీ. వరకు ఉండే అవకాశం ఉంది. పాత డస్టర్ విజయానికి డీజిల్ ఇంజిన్ ప్రధాన కారణం అయినప్పటికీ రాబోయే మోడల్ మాత్రం కేవలం పెట్రోల్ ఇంజిన్‌పై మాత్రమే ఆధారపడనుంది.
అంతర్జాతీయ మోడల్‌లో 1.2-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ ఉన్నప్పటికీ, భారత మార్కెట్‌కు సుమారు 1.3-లీటర్ HR13 టర్బో పెట్రోల్ ఇంజిన్ వచ్చే అవకాశం ఉంది. ఈ టర్బో ఇంజిన్ 154 బీహెచ్‌పీ పవర్, 250 ఎన్‌ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తుంది. భవిష్యత్తులో భారతదేశం కోసం స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
నిస్సాన్ టెక్టన్
రెనాల్ట్‌తో పాటు, నిస్సాన్ కూడా డస్టర్ ఆధారంగా ఒక కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త ఎస్‌యూవీకి నిస్సాన్ టెక్టన్ అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఇది రెనాల్ట్ డస్టర్‌పై ఆధారపడి ఉంటుంది. అదే CMF-B ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఎస్‌యూవీని 2026 మొదటి అర్ధభాగంలో డస్టర్‌తో దాదాపు ఒకే సమయంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. నిస్సాన్ టెక్టన్ బాహ్య డిజైన్ టీజర్‌ను ఇప్పటికే విడుదల చేసింది. ఇది ఫ్లాగ్‌షిప్ పెట్రోల్ ఎస్‌యూవీల నుంచి ప్రేరణ పొందిందని తెలుస్తోంది.
ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ పోలిక
రెనాల్ట్ డస్టర్ మరియు నిస్సాన్ టెక్టన్ మధ్య అనేక అంశాలలో సారూప్యతలు ఉండవచ్చు. నిస్సాన్ టెక్టన్ కూడా డస్టర్ 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (154 బీహెచ్‌పీ, 250 ఎన్‌ఎమ్) నే పంచుకునే అవకాశం ఉంది. మీడియా నివేదికల ప్రకారం... ఈ రెండు ఎస్‌యూవీలలో దాదాపు ఒకే విధమైన ఫీచర్ కిట్ ఉంటుంది, అయినప్పటికీ వేరియంట్లలో కొన్ని తేడాలు ఉండవచ్చు. రెనాల్ట్, నిస్సాన్ సంస్థలు మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి కొత్త ఉత్పాదనలను తీసుకురావడం ద్వారా, మారుతి సుజుకి, టాటా వంటి ప్రస్తుత పోటీదారులకు గట్టి సవాలు విసరనున్నాయి. ఈ సెగ్మెంట్ భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తుందని అంచనా.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

