Renault Duster 2026 : రెనాల్ట్ డస్టర్ పవర్‌ఫుల్ రీ-ఎంట్రీ.. క్రెటాకు గట్టి పోటీ తప్పదు!

Renault Duster 2026 : రెనాల్ట్ డస్టర్ పవర్‌ఫుల్ రీ-ఎంట్రీ.. క్రెటాకు గట్టి పోటీ తప్పదు!
X

Renault Duster 2026 : ఒకప్పుడు భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌ను ఏలిన రెనాల్ట్ డస్టర్, పోటీని తట్టుకోలేక 2022లో నిలిచిపోయింది. అయితే డస్టర్ అభిమానుల కోసం రెనాల్ట్ ఒక శుభవార్తను ప్రకటించింది. ఈ ఫ్రెంచ్ కంపెనీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ 2026 రెనాల్ట్ డస్టర్‌తో భారత మార్కెట్‌లోకి పవర్ఫుల్‎గా తిరిగి రాబోతోంది. ఈ కొత్త మోడల్ 2025 జనవరి 26న భారతదేశంలో ఆవిష్కరించబడుతుంది. సరికొత్త డిజైన్, మరింత శక్తివంతమైన ఇంజిన్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీ, త్వరలోనే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మిడ్‌సైజ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

2026 రెనాల్ట్ డస్టర్, రెనాల్ట్ Renault.Rethink ప్రణాళికలో ఒక భాగం. ఈ కొత్త ఎస్‌యూవీ సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌ను అనుసరించనుంది. ముఖ్యంగా ఇది మాడ్యులర్ CMG-B ప్లాట్‌ఫామ్పై నిర్మించనున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ కారణంగా కారు మరింత బలంగా, సురక్షితంగా ఉంటుంది. దీని డిజైన్ గ్లోబల్ మోడల్‌ను పోలి ఉంటుంది. డిజైన్ హైలైట్స్ చూస్తే ఇది బోల్డ్, స్టైలిష్ లుక్‌తో పాటు, పెద్ద వీల్ ఆర్చెస్, షార్క్ ఫిన్ యాంటెన్నా, స్పెషల్ V-ఆకారపు టెయిల్ ల్యాంప్స్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో అప్‌డేటెడ్ రెనాల్ట్ లోగోతో పాటు Y-ఆకారపు LED లైటింగ్ ఎలిమెంట్స్ వంటి అడ్వాన్సుడ్ డిజైన్ అంశాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి.

పాత డస్టర్‌తో పోలిస్తే, 2026 రెనాల్ట్ డస్టర్ ఇంటీరియర్ చాలా ప్రీమియంగా, అప్‌మార్కెట్‌గా ఉండనుంది. అధికారిక ఫీచర్లు ఇంకా ప్రకటించనప్పటికీ ఇందులో అనేక అద్భుతమైన ఫీచర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యమైన కంఫర్ట్ ఫీచర్లలో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్‌కు సౌకర్యాన్నిచ్చే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ ఏసీ వెంట్స్ ఉంటాయి. సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.

కొత్త 2026 రెనాల్ట్ డస్టర్ కేవలం పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే మార్కెట్‌లోకి రానుంది. ఇందులో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఉండే అవకాశం లేదు. రెనాల్ట్ ఈ ఎస్‌యూవీలో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లను అందించనుంది. వాటిలో ముఖ్యమైనది.. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది దాదాపు 156 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవది, బేస్ వేరియంట్‌లలో మాత్రమే లభించే అవకాశం ఉన్న 1.0 లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఈ రెండు ఇంజిన్లలోనూ కస్టమర్లు తమకు నచ్చిన మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

Tags

Next Story