Duster vs Kiger : డస్టర్ వర్సెస్ కైగర్.. ఒకే ఇంజిన్ ఉన్నా ఏ కారు బాగుంటుంది?

Duster vs Kiger : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలలో ఒకటైన రెనాల్ట్ డస్టర్ సరికొత్త రూపంలో తిరిగి వస్తోంది. మూడవ తరం డస్టర్‌ను కంపెనీ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కొత్త డస్టర్ బేస్ మోడల్‌లో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెనాల్ట్ కైగర్ టాప్ మోడల్‌లో ఉన్న అదే 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఒకే ఇంజిన్ ఉన్నప్పటికీ, ఈ రెండు కార్లలో ఏది బెస్ట్? వీటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటి? అనే ఆసక్తికర విషయాలను వివరంగా తెలుసుకుందాం.
టర్బో ఇంజిన్ పవర్
రెనో డస్టర్, కైగర్ రెండింటిలోనూ 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇవి రెండూ దాదాపు 100 PS పవర్‌ను, 160 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే, గేర్‌బాక్స్ విషయంలో రెనో చిన్న మార్పు చేసింది. డస్టర్‌లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఇచ్చారు. దీనివల్ల హైవేలపై ప్రయాణించేటప్పుడు కారు మరింత స్మూత్‌గా, తక్కువ ఒత్తిడితో వెళ్తుంది. అదే కైగర్ విషయానికి వస్తే, ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. సిటీలో డ్రైవింగ్ చేసే వారికి కైగర్ ఆటోమేటిక్ వెర్షన్ సౌకర్యవంతంగా ఉంటుంది.
డిజైన్, లుక్స్
కొత్త డస్టర్ డిజైన్ పరంగా గత మోడల్స్ కంటే చాలా ఆధునికంగా మారింది. ముందు భాగంలో ఐబ్రో స్టైల్ ఎల్‌ఈడీ డిఆర్ఎల్స్, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. 18-అంగుళాల భారీ అలాయ్ వీల్స్, సి-పిల్లర్‌పై అమర్చిన డోర్ హ్యాండిల్స్ దీనికి ప్రత్యేక ఆకర్షణ. మరోవైపు, కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కావడంతో చూడటానికి స్పోర్టీగా ఉంటుంది. కానీ, డస్టర్ తన భారీ సైజు, రోడ్ ప్రెజెన్స్‌తో కైగర్ కంటే ఎంతో ఎత్తులో నిలుస్తుంది.
ఇంటీరియర్, లగ్జరీ ఫీచర్లు
డస్టర్ క్యాబిన్‌ను రెనాల్ట్ సంస్థ అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దింది. ఇందులో డ్యూయల్-టోన్ క్యాబిన్ థీమ్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, లెదర్ సీట్లను అమర్చారు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే డస్టర్ ఒక రేంజ్ పైన ఉంది. 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ అడ్జస్టబుల్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కైగర్ కూడా మంచి ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ, డస్టర్ ఇచ్చే లగ్జరీ అనుభూతిని అది అందుకోలేదు.
సేఫ్టీలో రాజీ లేదు
సేఫ్టీ విషయంలో కొత్త డస్టర్ సరికొత్త రికార్డులు సృష్టించేలా కనిపిస్తోంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తున్నాయి. వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, అత్యంత అధునాతనమైన లెవల్-2 ADAS టెక్నాలజీని కూడా జోడించారు. కైగర్‌లో కూడా మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి కానీ, ADAS వంటి ఫీచర్లు డస్టర్‌కే పరిమితం.
ఏది ఎవరికి బెస్ట్?
చివరగా.. మీరు బడ్జెట్ ధరలో ఒక స్టైలిష్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం చూస్తుంటే, రూ.9.15 లక్షల (ప్రారంభ ధర) వద్ద కైగర్ టర్బో పెట్రోల్ మంచి ఆప్షన్. కానీ, మీకు భారీ సైజు కారు కావాలి, రోడ్డుపై వెళ్తుంటే అందరూ చూడాలి అనుకుంటే మాత్రం మార్చి 2026లో లాంచ్ కాబోతున్న కొత్త డస్టర్ కోసం ఆగడం మంచిది. ఒకే ఇంజిన్ ఉన్నప్పటికీ, డస్టర్ అందించే కంఫర్ట్, సెక్యూరిటీ, లుక్స్ కైగర్ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
