Royal Enfield : బైక్ లవర్స్ కు పండగే.. సరికొత్త హంగులతో వస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450.

Royal Enfield : బైక్ లవర్స్ కు పండగే.. సరికొత్త హంగులతో వస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450.
X

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటేనే కుర్రకారుకు ఒక క్రేజ్. ఈ కంపెనీ నుంచి వచ్చే ప్రతి బైక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తుంది. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పవర్‌ఫుల్ 450 సీసీ లైనప్‌లో ఉన్న గెరిల్లా 450ను కొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. 2024లో తొలిసారి లాంచ్ అయిన ఈ బైక్‌కు, దాదాపు రెండేళ్ల తర్వాత మొదటిసారి అప్‌డేట్ ఇస్తోంది కంపెనీ. సమాచారం ప్రకారం.. ఈ లేటెస్ట్ వర్షన్ బైక్ మార్చి 2026 నెలాఖరుకల్లా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. బైక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ అప్‌డేటెడ్ మోడల్‌లో రైడర్ కంఫర్ట్ కోసం కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

రైడింగ్ అనుభవం ఇక మరింత స్మూత్

ఈ కొత్త గెరిల్లా 450లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రధానంగా గేయర్‌బాక్స్, రైడింగ్ కంట్రోల్స్ మీద ఫోకస్ పెట్టినట్లు సమాచారం. గతంలో హంటర్ 350 విషయంలో చేసినట్లే, ఇప్పుడు ఈ బైక్‌లో కూడా గేర్ మార్పులను మరింత సులభతరం చేసేలా రీ-డిజైన్ చేశారట. దీనివల్ల సిటీ ట్రాఫిక్‌లో గానీ, లాంగ్ జర్నీలలో గానీ రైడర్‌కు ఎలాంటి అలసట లేకుండా స్మూత్ రైడింగ్ అనుభవం కలుగుతుంది. ప్రస్తుతానికి ఈ అప్‌డేట్స్ గురించి కంపెనీ అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడించకపోయినప్పటికీ, లుక్ పరంగా కూడా ఇది మరింత స్టైలిష్‌గా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్.

కళ్లు చెదిరే కొత్త రంగులు

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గెరిల్లా 450 బ్రావా బ్లూ, షాడో యాష్ వంటి ఆరు రంగుల్లో లభిస్తోంది. అయితే కొత్త వర్షన్‌లో కంపెనీ మరికొన్ని వైబ్రెంట్ కలర్ ఆప్షన్లను పరిచయం చేయబోతోంది. కేవలం రంగులు మార్చడమే కాకుండా గ్రాఫిక్స్, డిజైన్ ఎలిమెంట్లలో కూడా మెరుగులు దిద్దనున్నారు. ప్రస్తుతం ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.56 లక్షలుగా ఉంది. కొత్త ఫీచర్లు యాడ్ అవ్వడం వల్ల ధరలో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. అయినా సరే, రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు ఇది ఒక స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి.

షెర్పా ఇంజిన్ పవర్

ఈ బైక్‌లో హిమాలయన్ 450లో వాడిన ప్రసిద్ధ షెర్పా 450 ఇంజిన్‌నే కొనసాగిస్తున్నారు. ఇది 452 సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్. ఇది ఏకంగా 40 హార్స్ పవర్ మరియు 40 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గియర్‌బాక్స్, రైడ్-బై-వైర్ టెక్నాలజీ మరియు రెండు రకాల రైడింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఏ రోడ్డు మీదైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ ఇంజిన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది.

సేఫ్టీలోనూ బెస్ట్

బైక్ ఎంత వేగంగా వెళ్తుందో అంతే సురక్షితంగా ఆగడం కూడా ముఖ్యం. అందుకే ఇందులో ముందు వైపు 310 మిమీ, వెనుక వైపు 270 మిమీ డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ను అందించారు. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు వైపు 43 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు మోనో-షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. దీనివల్ల గుంతల రోడ్ల మీద కూడా ప్రయాణం కుదుపులు లేకుండా సాగిపోతుంది. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఈ బైక్ రోడ్డుపై గ్రిప్ విషయంలోనూ అదుర్స్ అనిపిస్తుంది.

Tags

Next Story