Royal Enfield Hunter 350 : లీటరుకు 36 కిలోమీటర్ల మైలేజీ.. రూ. 1.37 లక్షలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350.

Royal Enfield Hunter 350 : లీటరుకు 36 కిలోమీటర్ల మైలేజీ.. రూ. 1.37 లక్షలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350.
X

Royal Enfield Hunter 350 : మీరు ప్రతిరోజూ కాలేజీకో లేదా ఆఫీసుకో వెళ్లడానికి ఒక అదిరిపోయే లుక్ ఉన్న దమ్మున్న బైక్ కోసం చూస్తున్నారా? అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వస్తున్న మోస్ట్ అఫర్డబుల్ బైక్ హంటర్ 350 మీ బెస్ట్ ఛాయిస్ కావచ్చు. మధ్యతరగతి యువతను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ బైక్, స్టైల్‌కు స్టైల్.. మైలేజీకి మైలేజ్ ఇస్తూ మార్కెట్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో ఈ బైక్‌ను హ్యాండిల్ చేయడం చాలా సులభం కాబట్టి, డైలీ రైడర్లకు ఇది ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే లక్షల్లో ఉంటుంది అని భయపడే వారికి హంటర్ 350 ఒక తీపి కబురు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, దీని ప్రారంభ ధర (ఫ్యాక్టరీ బ్లాక్ వేరియంట్) కేవలం రూ.1,37,640 (ఎక్స్-షోరూమ్) మాత్రమే. అంటే ఒక సాధారణ 150cc బైక్ ధరకే మీరు 350cc రాయల్ ఎన్‌ఫీల్డ్ రాజసాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే మీరు ఎంచుకునే రంగులను బట్టి ధరలు మారుతుంటాయి. రెబెల్ బ్లూ, లండన్ రెడ్ వంటి ప్రీమియం కలర్స్ కావాలంటే రూ. 1.66 లక్షల వరకు ఖర్చవుతుంది.

సాధారణంగా బుల్లెట్ బైకులు మైలేజీ తక్కువ ఇస్తాయనే టాక్ ఉంది. కానీ హంటర్ 350 విషయంలో అది అబద్ధం అని కంపెనీ నిరూపించింది. ఇందులో పవర్‌ఫుల్ 349cc J-సిరీస్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 20.2 bhp పవర్, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంతటి పవర్ఫుల్ ఇంజిన్ ఉన్నప్పటికీ, ఈ బైక్ లీటరుకు 36.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ ధీమాగా చెబుతోంది. అంతేకాదు, దీని టాప్ స్పీడ్ గంటకు 114 కిలోమీటర్లు, కాబట్టి హైవేల మీద కూడా ఇది పులిలా దూసుకుపోతుంది.

హంటర్ 350 కేవలం లుక్ పరంగానే కాదు, ఫీచర్ల పరంగా కూడా చాలా మోడ్రన్‌గా ఉంటుంది. ఇందులో డిజిటల్ అనలాగ్ డ్యాష్‌బోర్డ్, ప్రయాణంలో ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి టైప్-సి పోర్ట్, స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. సేఫ్టీ కోసం డ్యూయల్ ఛానల్ ABS (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను అందించారు. దీనివల్ల బైక్ సడన్ బ్రేక్ వేసినా స్కిడ్ అవ్వదు. 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 160mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఏ రకమైన రోడ్ల మీదైనా ఇది సాఫీగా సాగిపోతుంది.

Tags

Next Story