Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350 స్పెషల్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350 స్పెషల్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
X

Royal Enfield : గోవాలో జరుగుతున్న మోటోవర్స్ 2025 ఈవెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ పాపులర్ క్రూయిజర్ బైక్ మెటియోర్ 350 స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఎడిషన్‌కు సన్‌డౌనర్ ఆరెంజ్ అని పేరు పెట్టారు. ప్రత్యేకంగా పర్యటనలకు వెళ్లే రైడర్లను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్‌ను డిజైన్ చేశారు. సరికొత్త ఆరెంజ్ కలర్ స్కీమ్‌తో పాటు ఇందులో అదనంగా ఎన్నో టూరింగ్ ఫీచర్లు జోడించారు. ఈ స్పెషల్ ఎడిషన్ ధర ఎంత, ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం.

స్పెషల్ ఎడిషన్‌లో కొత్త ఫీచర్లు

రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్ ఎడిషన్‌ను టూరింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే ఇందులో ఈ క్రింది అదనపు ఫీచర్లు ఉన్నాయి..ఇందులో డీలక్స్ టూరింగ్ సీట్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, ఫ్లైస్క్రీన్ , ప్యాసింజర్ బ్యాక్‌రెస్ట్ ఉన్నాయి. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే LED హెడ్‌ల్యాంప్, అల్యూమినియం ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్, అడ్జస్టబుల్ లీవర్లు, స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్, USB టైప్ C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ కూడా అందించారు.

ఇంజిన్, పవర్‌ట్రైన్

ఈ అప్‌గ్రేడ్‌లు అన్నింటితో పాటు, మెటియోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్ ఎడిషన్ ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎప్పటి లాగే ఇందులో 349 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్, 20.2 హెచ్‌పి పవర్, 27 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. సస్పెన్షన్, ఛాసిస్, బ్రేకింగ్ సెటప్‌లో కూడా ఎలాంటి మార్పులూ లేవు.

ధర వివరాలు, ఇతర ఆప్షన్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350 స్పెషల్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.2,18,882 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ బైక్ బుకింగ్‌లు నవంబర్ 22, 2025 నుంచే ప్రారంభమయ్యాయి. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే ఈ స్పెషల్ ఎడిషన్ రూ.27,649 ఎక్కువ ఖరీదైనది. రూ.2.5 లక్షల కంటే తక్కువ ధరలో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌తో పాటు ఇతర ప్రముఖ మోడల్స్‌లో KTM 250 Duke, Triumph Speed T4, TVS Apache RTR 310, Triumph Speed 400 వంటి మోడల్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Tags

Next Story